'ఆర్య' సినిమాలో 'అ అంటే అమలాపురం' నుంచి 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' సాంగ్ వరకూ... ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్స్‌ను సుకుమార్ చాలా అంటే చాలా స్పెషల్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ తీసిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఇంకా స్పెషల్. 'అ అంటే అమలాపురం', 'రింగ... రింగ' సాంగ్స్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. దాంతో ఇప్పుడు 'పుష్ప: ద రైజ్'లో సాంగ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఆడియన్స్‌లో ఉంది. దానికి తోడు ఆ సాంగ్‌లో సమంత స్టెప్స్ వేయనున్నారనే విషయం అంచనాలను ఇంకొంచెం పెంచింది. ఈ పాటను యంగ్ అండ్ అప్ కమింగ్ మాస్టర్ చేత కొరియోగ్రఫీ చేయించాలని అల్లు అర్జున్, సుకుమార్ డిసైడ్ అయినట్టు సమాచారం.
'పుష్ప: ద రైజ్'లో స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ యశ్ మాస్టర్‌కు దక్కినట్టు తెలుస్తోంది. డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో యశ్ వెలుగులోకి వచ్చారు. అతడి టాలెంట్ చూసి స్టార్స్ అవకాశాలు ఇస్తున్నారు. సమంతతో సాంగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ యశ్‌కు ఉంది. 'యు టర్న్' సినిమా థీమ్ సాంగ్ చేశాడు. అయితే... అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్‌తో ఇప్పటివరకూ చేయలేదు. 'పుష్ప' అతడికి ఫస్ట్ బిగ్ టికెట్ ఫిల్మ్ అని చెప్పాలి. గతంలోనూ 'ఢీ' నుంచి వచ్చిన కొంత మంది టాలెంటెడ్ డాన్స్ మాస్టర్లకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు డాన్స్‌లో కొత్తదనం చూపించాలని ప్రయత్నించే ఐకాన్ స్టార్, యంగ్ మాస్టర్లకు కూడా ఛాన్సులు ఇస్తున్నారు. 'ప్రతిరోజూ పండగే'లో 'ఓ బావా...', 'చిత్రలహరి' సినిమాలో 'గ్లాస్ మేట్స్', 'సోలో బ్రతుకే సో బెటర్'లో 'నో పెళ్లి...' పాటలకు యశ్ కొరియోగ్రఫీ చేశారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న 'పుష్ప' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ఐదో పాట అల్లు అర్జున్, సమంతపై చిత్రీకరించనున్న స్పెషల్ సాంగ్. త్వరలో దానిని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
Also Read: పునీత్‌కు అరుదైన గౌరవం.. 'కర్ణాటకరత్న' అవార్డుతో సత్కారం..
Also Read: సెల్యూట్ టు సూర్య.. కామ్రేడ్ బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతికి రూ.15 లక్షల చెక్..
Also Read: సిరితో ఎమోషనల్ కనెక్షన్.. భయపడుతోన్న షణ్ముఖ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి