వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనాను మించిన వారు లేరు. ఒకవైపు తీవ్ర విమర్శల దుమారం రేగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోసారి మన స్వాతంత్ర్యం పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈసారి నేరుగా గాంధీనే టార్గెట్ చేసింది. గాంధీ అహింసా మార్గాన్నే ఆమె ఎద్దేవా చేసింది.‘ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి’ అన్న గాంధీ ప్రవచనాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడింది. ‘అలా చేసి తెచ్చుకున్నది స్వాతంత్ర్యం కాదు... దాన్ని భిక్షే అంటారు’ అంటూ మళ్లీ మళ్ళీ అదే పదాన్ని వాడింది. అంతేకాదు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు అప్పట్లో గాంధీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.
గత వారం ఆమె భారతదేశానికి స్వాతంత్య్రం 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిందని కామెంట్లు చేసింది. అవి పెద్ద దుమారాన్నే రేపాయి. కంగనాను తిట్టిపోస్తూ పలు సంఘాలు ధర్నాలు చేశాయి. కంగనాకు ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఇంతజరుగుతున్నా కంగనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తిరిగి మంగళవారం అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేసింది. తన ఇన్ స్టా ఖాతాలో ఒక సిరీస్ లా వివాదాస్పద పోస్టులు పెడుతోంది.
ఇన్ స్టాను వాడేస్తోంది...
ఇప్పటికే ఇలాంటి పోస్టులు కారణంగా ఆమె ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపి వేసి, తిరిగి పునరుద్ధరించారు. ఇప్పుడు ఇన్ స్టా మీద పడి మన స్వాతంత్య్రోద్యమాన్ని చులకన చేసి మాట్లాడుతోంది. ‘నేతాజీని అప్పగించేందుకు గాంధీ అప్పట్లో అంగీకరించారు ’ అన్న హెడింగ్ తో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను కూడా ఆమె జత చేశారు. ‘మీరు గాంధీజీ అభిమానిగా, నేతాజీ మద్దతుదారుగా ఉండలేరు. వారిద్దరిలో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ హీరోను తెలివిగా ఎంచుకోండి’ అంటూ ఓ పోస్టులో పేర్కొంది. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎంత దుమారం రేగనుందో చూడాలి.
ప్రస్తుతం కంగనా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఈ పోస్టులు కనిపించడం లేదు.
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: నామినేషన్ లో ఎనిమిది మంది.. ఎవరెవరంటే..?
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ వచ్చేసిందోచ్.. ఈసారి కూడా కొత్తగా ట్రై చేస్తూ..
Also Read: ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ స్టార్.. ఫొటోలు వైరల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి