సాంబారు చేస్తే పక్కన డీప్ ఫ్రై చేసిన బంగాళా దుంప వేపుడు ఉండాల్సిందే, లేకుంటే సాంబారు ముద్ద గొంతు దిగదు. ఆదివారం వస్తే చాలు చేప, చికెన్ లీటర్ నూనెలో బాగా వేయించి తీయాలి. అప్పుడే అవి కరకరలాడేది. ఇవేనా ఫ్రైంచ్ ఫ్రైస్, చీజ్ స్టిక్స్, నగ్గెట్స్... ఇలా మరగకాచిన నూనెలో ముంచి తీసే పదార్థాలు ఎన్నో. ఇవన్నీ ఎంతో మందికి నచ్చే వంటకాలు. ఇలాంటి డీప్ ఫ్రై వేపుళ్లను అతిగా తింటే ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితులను కోరి తెచ్చుకున్నవారవుతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
గుండె జబ్బులు
వేపుళ్లు అధికంగా తినేవారికి అంటే రోజూ తినేవారు, అందులోనూ గిన్నెల కొద్దీ లాగించేవారికి గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. వీటి వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గి, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే హైబీపీ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతోంది.
మధుమేహం
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందా శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వేపుడు పదార్థాలు అప్పుడప్పుడు తినేవారితో పోలిస్తే వారంతో నాలుగు నుంచి ఆరుసార్లు తినేవారిలో డయాబెటిస్ వచ్చే ముప్పు 39 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వేపుళ్లలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి బరువును పెంచడంతో పాటూ, హార్మోన్ల వ్యవస్థనూ పాడు చేస్తాయి. ఈ పరిస్థితి మధుమేహానికి దారి తీస్తోంది.
క్యాన్సర్లు
భయంకరమైన రోగాల్లో క్యాన్సర్లు ఒకటి. సలసల కాగే నూనెలో పదార్థాలను వేయించినప్పుడు అందులో ‘ఆక్రిలమైడ్’ అనే విషతుల్యమైన సమ్మేళనం ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా బంగాళాదుంపల వంటివి వేయించినప్పుడు ఇలా జరుగుతుంది. ఇది చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నట్టు కొన్ని పరిశోధనలు చెప్పాయి. అయితే నేరుగా మనుషులపై ఎంతగా ప్రభావం చూపిస్తుందో తెలియరాలేదు. ప్రస్తుతం ఈ విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి వేపుళ్లు అధికంగా తింటే క్యాన్సర్ వస్తుందని లేక రాదని కచ్చితంగా చెప్పలేం. కానీ అతిగా తినడం ఆరోగ్యకరం కాదని మాత్రం చెప్పగలం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: రోజుకో గ్లాసు వైన్ తాగితే చాలు... కీళ్ల నొప్పులు మాయం, కనిపెట్టిన కొత్త అధ్యయనం
Read Also: మతిమరుపు వ్యాధిని అరికట్టేందుకు వ్యాక్సిన్ వస్తుందోచ్...
Read Also: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Read Also: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?