మేషం
ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. యువతకు కెరీర్‌కు సంబంధించిన సమాచారం అందుతుంది. ఖర్చులు పెరుగుతాయి.  స్నేహితుల సహాయంతో  మీ పని ముందుకు సాగుతుంది. ఓ పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
వృషభం
ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు.  వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి  ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  ఖర్చులు తగ్గించండి. విద్యార్థులు శ్రమించాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. పని ఒత్తిడి తగ్గుతుంది. సంతోషంగా ఉంటారు.
మిథునం
దీర్ఘకాలిక వ్యాధి మళ్లీ తలెత్తవచ్చు. కరెంట్, వాహనాలతో జాగ్రత్త. తెలియని వారిని నమ్మొద్దు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. శుభవార్త వినే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. 
Also Read: ఆ ఫీలింగ్స్ ఆడవారికే ఎక్కువట… వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదట…
కర్కాటకం
నిరుద్యోగులకు శుభసమయం. మీ ఆదాయం పెరుగుతుంది.  అదృష్టం కలిసొస్తుంది.  కుటుంబానికి సంబంధించిన ఆందోళన ఉంటుంది. ప్రత్యర్థులు మౌనంగా ఉంటారు. వృత్తి పరంగా విజయం సాధిస్తారు.  వ్యాపార ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. 
సింహం
తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మతపరమైన పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.
కన్య 
లావాదేవీల విషయంలో తొందరపడకండి. దీర్ఘకాలిక వ్యాధి తిరగబెట్టే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో  అసౌకర్యానికి గురవుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి తొందరపడకండి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి మాట వినండి. పెద్దల సలహాలు తీసుకోండి. వ్యాపార ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. 
Also Read: ద్వారానికి అటు ఇటు ఉండి ఏమీ తీసుకోకూడదంటారు ఎందుకు...
తుల 
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. స్నేహితుల నుంచి సహాయం అందుకుంటారు.  ఉత్సాహంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. విద్యార్థులు, యువత విజయం సాధిస్తారు. చదువుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఏదైనా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. 
వృశ్చికం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. శారీరక ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆందోళన కొనసాగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కారణం లేకుండా వివాదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏదో చింత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది.
ధనుస్సు
రుణం మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. తెలియని వ్యక్తుల నుంచి దూరం పాటించండి.  బంధువులను కలుస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజంతా  సానుకూలంగా ఉంటుంది. భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. శుభవార్త వింటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
మకరం
ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కలిసొచ్చే సమయం. వృద్ధుల ఆరోగ్యం క్షీణించవచ్చు. అవసరం అయిన వారికి సహాయం చేస్తారు.
కుంభం
కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం వచ్చే అవకాశం ఉంది. సోమరితనం వద్దు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  జీవిత భాగస్వామితో  సంతోషంగా ఉంటారు. 
మీనం
ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు.  మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read:

  ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి