అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు…జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటుంది. అయితే అతి ముఖ్యమైన ఆ ఐదు విషయాల్లో పురుషుల కన్నా మహిళలే ముందుంటారని చెప్పాడు చాణక్యుడు. అవేంటంటే... 1.తెలివితేటలుపురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ తెలివితేటలు ఉంటాయట. అందుకే మహిళలు ఎంత కష్టమైన పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. సమస్యకు పరిష్కారం లభించేవరకూ విశ్రమించరట.2.ధైర్యంధైర్యం విషయంలోనూ మహిళలదే పైచేయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భయపడి వెనక్కు తగ్గడం అనే మాటే ఉండదట. కౌటిల్యుడి మాటలు పరిగణలోకి తీసుకుంటే మగవారి కన్నా మగువలకు ఆరురెట్లు ధైర్యం ఎక్కువ ఉంటుందట. Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది.. 3.ఆకలిఆకలి, తిండి లోనూ మహిళలే మహరాణులు అంటాడు చాణక్యుడు. సాధారణంగా ఆడవారి కన్నా మగవారు ఎక్కువ తింటారని అనుకుంటాం . కానీ కౌటిల్యుడి ప్రకారం మగవారి కన్నా మహిళలే ఎక్కువ తింటారట. అంతేకాదు ఆడవారికి త్వరగా ఆకలేస్తుందట. మహిళల శరీర కూర్పు కారణంగా వారికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయని, అందుకే వారు ఎక్కువ తినాలని కూడా పెద్దలు చెబుతుంటారు. చాణక్యుడి చెప్పిందీ ఇదే…4.పొదుపు కిడ్డీ బ్యాంక్ మొదలు పోపుల పెట్టె వరకూ పొదుపు విషయంలో మహిళల్ని అస్సలు దాటలేరట మగవారు. షాపింగులు, సరదాలు, మేకప్పుల పేరుతో ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారని అనుకుంటా కానీ… పొదుపు విషయంలోనూ అంతకు మించి అనేలా ఉంటారట. ఎంత సొమ్ముతో షాపింగ్ చేయాలో.. ఏ వస్తువుకు ఎంత ఖర్చు చేయాలో వారికి బాగా తెలుసట. అలాగే డబ్బు ఆదా చేయడంలోనూ ఆడవారిదే పైచేయి. Also Read: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి..?5.లైంగిక వాంఛలుసాధారణంగా శృంగారాన్ని పురుషులతో ముడిపెట్టి చూస్తారు. కానీ మగవారితో పోలిస్తే మగువల్లో లైంగిక వాంఛ ఎనిమిది రెట్లు ఎక్కువంటాడు చాణక్యుడు. అందుకే మగవారు సంతృప్తి పొందినంత త్వరగా మహిళల్లో ఆ ఫీలింగ్ కనిపించదట. ఇదే విషయాన్ని వైద్యశాస్త్ర నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. చాలా అధ్యయనాల్లో ఈ విషయాల్లో అమ్మాయిలదే పైచేయి అని తేలింది. సిగ్గు విషయానికొస్తే మాత్రం మగవారి కన్నా మహిళలే సిగ్గుపడతారని స్పష్టం చేశాడు కౌటిల్యుడు. Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంటAlso Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Chanakya Niti: ఆ ఫీలింగ్స్ ఆడవారికే ఎక్కువట… వారిని సంతృప్తి పరచడం అంత ఈజీ కాదట…
ABP Desam | RamaLakshmibai | 16 Nov 2021 12:15 PM (IST)
స్త్రీలు, పురుషులు ఎవరు బెస్ట్ అంటే చెప్పలేం. ఎందుకంటే కొన్ని విషయాలలో స్త్రీలు ముందుంటే..మరికొన్ని విషయాల్లో పురుషులు ముందుంటారు. అయితే ముఖ్యమైన విషయాల్లో మాత్రం స్త్రీలదే డామినేషన్ అంటాడు చాణక్యుడు
Chanakya Niti