Ayyappa Deeksha: అయ్యప్ప మాల వెనుక ఆరోగ్యం రహస్యం ఏంటి..?
Continues below advertisement
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః
హరి హర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః...
అంటూ కార్తీకమాసం మొదలు మకరసంక్రాంతి వరకూ ఎక్కడ చూసినా శరణు ఘోష వినిపిస్తుంటుంది. ఎటు చూసినా అయ్యప్ప మాలధారులే కనిపిస్తారు. 41 రోజుల పాటూ అత్యంత నియమ నిష్టలతో దీక్ష చేస్తారు. మండల దీక్ష పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటిస్తారు. నేలమీద పడుకోవడం, చన్నీటి స్నానం, ఏకభుక్తం, పాదరక్షలు ధరించకపోవడం పాటిస్తారు. ఈ నియమాలన్నింటి వెనుక భక్తి మాత్రమే కాదు..ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.
Continues below advertisement