ABP  WhatsApp

Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'

ABP Desam Updated at: 18 Nov 2021 03:25 PM (IST)
Edited By: Murali Krishna

భాజపా చేసిన దానికి తగిన ప్రతిఫలం చేస్తామని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ హెచ్చరించారు.

భాజపాకు శరద్ పవార్ హెచ్చరిక

NEXT PREV

మోదీ సర్కార్‌పై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ను జైలుకు పంపినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పవార్ హెచ్చరించారు. నాగ్‌పుర్‌లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవార్ ఈ విధంగా మాట్లాడారు.



అనిల్ దేశ్‌ముఖ్‌ను జైలుకు పంపినదానికి మీరు (భాజపా) తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీరు చేసిన దానికి వడ్డీతో సహా చెల్లిస్తాం. రాష్ట్రాన్ని ఎంతో శాంతంగా పరిపాలించాలని ఆయన అనుకున్నారు. అధికారాన్ని మంచికే ఉపయోగించారు. ఆయనకు అధికారం వచ్చినా కాళ్లు నేలపైనే ఉన్నాయి. కానీ అధికారం కోల్పోతే కొత్త మందికి కాళ్లు నేలపైన ఉండవు. అధికార మంద తలకెక్కిపోయింది.                                 - శరద్ పవార్, ఎన్‌సీపీ అధినేత  


మనీ లాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించిన తర్వాత మహారాష్ట్రలో రాజకీయం మరింత వేడెక్కింది. సీబీఐను ఉపయోగించుకొని రాజకీయ కక్షసాధింపు చర్యలకు భాజపా పాల్పడుతోందని మహారాష్ట్ర సర్కార్ ఆరోపించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపరణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని కోర్టును కోరింది. అయితే ప్రస్తుతం జరుగుతోన్న దర్యాప్తును నీరుగార్చాలని మహారాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తుందని కోర్టులో సీబీఐ వాదించింది.


ఇదీ కేసు..


అనిల్ దేశ్​ముఖ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) ఈనెల 2న అర్ధరాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో 12 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అనిల్ దేశ్​ముఖ్​తో పాటు కుందన్​ షిందే, సంజీవ్ పలాండేలను సైతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్లు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారులపై దేశ్‌ముఖ్‌ ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆయనపై కేసు నమోదు చేసింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఈడీ ఆయనపై చర్యలు చేపట్టింది.


Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'


Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!


Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్


Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు


Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..


Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!


Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!


Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 18 Nov 2021 03:23 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.