దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 11,919 కేసులు నమోదుకాగా 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,38,85,132కు పెరిగింది.
రికవరీ రేటు 98.28%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,762గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.37%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
కేరళ..
కేరళలో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 6,849 కరోనా కేసులు నమోదుకాగా 388 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,77,984కు పెరగగా మొత్తం మరణాల సంఖ్య 36,475కు చేరింది. గత 24 గంటల్లో 69,334 కొవిడ్ శాంపిళ్లను పరీక్షించారు.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 958 కరోనా కేసులు నమోదుకాగా కోజికోడ్ (932), తిరువనంతపురం (839) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,003 కరోనా కేసులు నమోదుకాగా 32 మంది మృతి చెందారు.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,95,653 మందికి కరోనా సోకింది. కరోనా ధాటికి 8,399 మంది మృతి చెందారు.
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి