తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల తీరుని సున్నితంగా విమర్శించారు. ప్రతీ ఏడాది సినిమా తారలకు సంతోషం అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఈ వేడుక జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రాఫర్ తలసాని శ్రీనివాస యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రెండు దశాబ్దాలుగా సంతోషం పత్రికను స్థాపించి అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని, బలమైన కోరికలు ఉంటేనే ఇలాంటి పనులు చేయగలమని అన్నారు. 

 


 

నిజానికి ఇలాంటి అవార్డు వేడుకలు ప్రభుత్వం నిర్వహించాలని.. సినీ కళాకారులను అవార్డులతో సత్కరించాలని అన్నారు. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డు వేడుకల విషయం మర్చిపోయాయని.. ఇకనైనా ఈ రెండు ప్రభుత్వాలు ఆలోచించి అవార్డు వేడుకలు నిర్వహిస్తే మంచిదని కామెంట్స్ చేశారు చిరు. 

 

రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నారా చంద్రబాబు నాయుడు నంది అవార్డులను మూడేళ్లకు ఎంపిక చేశారు. కానీ ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో.. సినిమా వాళ్లకు ఇవ్వాల్సిన అవార్డుల విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం సినిమా వాళ్లకు ఎలాంటి అవార్డులను ప్రకటించలేదు. 

 

తెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులకు సింహా అవార్డులను ప్రకటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ అలా జరగలేదు. ఇండస్ట్రీకి చెందిన ఎవరూ కూడా ఈ అవార్డుల గురించి ప్రశ్నించలేదు. ఇప్పుడు చిరు నేరుగా ఓ వేదికగా వీటి గురించి మాట్లాడడం వార్తల్లో నిలిచింది. మరి చిరంజీవి రిక్వెస్ట్ ను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటాయేమో చూద్దాం!

 



 



Also Read: పవన్ ని ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు..


Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!


Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!






 




ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి