ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు. వీటిలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. తనకు మంచి క్రేజ్ రాగానే వెంటనే బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయారు ఈ సెన్సేషనల్ హీరో. పలు సినిమాలను నిర్మిస్తూ.. లాభాలు వెనకేసుకుంటున్నారు. రీసెంట్ గా తన తమ్ముడ్ని హీరోగా పెట్టి 'పుష్పక విమానం' సినిమా తీశారు విజయ్ దేవరకొండ. తమ్ముడిని హీరోగా ప్రమోట్ చేసుకుంటూనే.. నిర్మాతగా కూడా మంచి లాభాలు పొందాడు. 

 


 

అయితే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నుంచి రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్ లు నిర్మాతలను సంప్రదించారు. కానీ విజయ్ దేవరకొండ స్వయంగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాకి పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. పేరున్న నటీనటులను తీసుకుంటే.. తక్కువ మొత్తంలోనే సినిమాను నిర్మించొచ్చు. 

 

పైగా ఇలాంటి కాన్సెప్ట్ లను బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఓటీటీకి అమ్ముకున్నా.. లాభాలు బాగానే వస్తాయి. ఇన్ని మంచి అవకాశాలు ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ మాత్రం ఎందుకు లైట్ తీసుకుంటాడు చెప్పండి..? అందుకే ఆయనే స్వయంగా బాలీవుడ్ లో ఈ సినిమా తీయాలనుకుంటున్నారు. బాలీవుడ్ కి చెందిన ఓ నిర్మాణ సంస్థ భాగస్వామ్యంతో విజయ్ సొంతంగా ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

 

ఈ సినిమాతో విజయ్ నిర్మాతగా కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం విజయ్ 'లైగర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతోంది. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 



Also Read: పవన్ ని ఒప్పించడానికి దిల్ రాజు ప్రయత్నాలు..


Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!


Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!


Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి