నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం డిసెంబర్ 24న విడుదల కానుంది.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే చిత్రంపై ఆసక్తిని రేకెత్తించాయి. దీంతో సినిమా అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పాటకు కూడా మాంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్‌ను విడుదల చేసింది. 


‘‘అడిగే అండ లేదు. కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి.. రాయడమే కాదు, కాలరాయడం కూడా తెలుసిన.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే..’’ అంటూ.. ‘శ్యామ్ సింగ రాయ్’ క్యారెక్టర్, టైటిల్‌ను టీజర్‌లో చూపించారు. చివర్లో ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు.. ఆఖరికి ఆ దేవుడికి కూడా.. ఖబడ్దార్’ అంటూ నాని.. బెంగాలీలో చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. అయితే.. ఈ టీజర్‌లో కేవలం నాని క్యారెక్టర్‌ను మాత్రమే పరిచయం చేశారు. సాయి పల్లవి అలా కనిపించి.. మాయమైంది. చివర్లో కృతి శెట్టి-నానిల లిప్ లాక్‌తో టీజర్ ముగిసింది. అయితే, మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్‌‌కు మాత్రం ఈ టీజర్‌లో స్థానం దక్కలేదు. ఆమె పాత్రను చూడాలంటే.. అభిమానులు ట్రైలర్ రిలీజ్ వరకు అగాల్సిందే. 


‘శ్యామ్ సింగ రాయ్’ తెలుగు టీజర్‌ను ఇక్కడ చూసేయండి: 






సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’లో రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సత్యదేవ్ జంగా కథ అందించిన ఈ చిత్రానికి మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. 



Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి