ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పెద్ద తలనొప్పిలా ఉండేది. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ ఫామ్ రాసి.. లైన్లో నిల్చొని ఇలా పెద్ద తతంగమే ఉండేది. అయితే యూపీఐ, డిజిటల్ లావాదేవీలు వచ్చాక ఒక్క ట్యాప్ చేస్తే అవతలి వారి ఖాతాలోకి డబ్బులు జమైపోతున్నాయి. అయితే ఇది మరింత సులభతరం కానుంది. కేవలం వాయిస్ చెప్తే చాలు సదరు ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చట. అదేలేగో చూసేయండి.
గూగుల్ పే..
ప్రస్తుతం గూగుల్ పే ఏడాదికి 400 బిలియన్ల డాలర్ల లావాదేవీలు జరుపుతోంది. అయితే వినియోగదారులకు మరింత సులభతరం చేసేందుకు మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే వాయిస్ కమాండ్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం. ఈ ఫీచర్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
స్పీచ్ టూ టెక్స్ట్..
త్వరలోనే ఈ స్పీచ్ టూ టెక్స్ట్ ఫీచర్‌ను గూగుల్ లాంచ్ చేయనుంది. వాయిస్ ఇన్‌పుట్ ద్వారా మనకు కావాల్సిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అకౌంట్ నంబర్‌ను హిందీ లేదా ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. అనంతరం సెండర్ కన్ఫర్మేషన్ తర్వాత పేమెంట్ జరుగుతుంది.
మై షాప్..
చిన్నచిన్న వ్యాపారులకు లావాదేవీలు మరింత సులభతరం చేసేందుకు త్వరలోనే 'మై షాప్'ను గూగుల్ లాంచ్ చేస్తుంది. గూగుల్ పే యాప్‌లో వారి వ్యాపారాలకు సంబంధించిన చిత్రాలు, వివరణలు, ధరలను నిమిషాల్లో జోడించి.. ఆ లింక్‌ను బిజినెస్ ప్రొఫైల్ ద్వారా గూగుల్ సోషల్ మీడియాల్లో షేర్ చేయొచ్చు. దీని ద్వారా వారి బిజినెస్ మరింత అభివృద్ధి చెందుతుందని గూగుల్ అభిప్రాయపడింది. కొన్ని రోజుల్లోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
జియోతో భాగస్వామ్యం..
భారతదేశ జనాభాలో సగం మంది ఇప్పటికీ స్మార్ట్ ఫోన్‌కు దూరంగానే ఉన్నారు. అలాంటి వారిని చేరుకోవడానికి గూగుల్.. Jioతో భాగస్వామ్యమైంది. ఇందులో భాగంగానే త్వరలోనే JioPhone Next తీసుకురానుంది. JioPhone Nextలో గూగుల్ అభివృద్ధి చేసిన 'ప్రగతి' OSతో వస్తుంది. ఇంతేకాకుండా మరింత తక్కువ ధరలతో లోకలైజ్‌డ్ స్మార్ట్‌ఫోన్‌లు తీసుకురావడానికి గూగుల్ కృషి చేస్తోంది.
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి