మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ఎన్‌సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడేపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్లలో ఆయన ముస్లిం అని రాసి ఉందన్నారు. ఈ సర్టిఫికెట్లను ఆయన విడుదల చేశారు.
1985, 1986కు ఏడాదికి సంబంధించిన సెయింట్ పాల్ హైస్కూల్ సర్టిఫికెట్లపై సమీర్ దావూద్ వాంఖడే అని పేరు ఉంది. పుట్టిన తేదీ 14-12-1979గా ఉంది. అయితే మతం వద్ద 'మాత్రం' ముస్లిం అని రాసి ఉంది.
ఇలాంటి నకిలీ పత్రాలతోనే వాంఖడే ఉద్యోగం సంపాదించారని మాలిక్ ఆరోపించారు. త్వరలోనే ఆయన ఉద్యోగం ఊడుతుందని పునరుద్ఘాటించారు.
పరువునష్టం దావా..
మంత్రి నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వాంఖడే తండ్రి బాంబే హైకోర్టులో ఇటీవల పరువునష్టం దావా వేశారు. రూ.1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
ఈ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు.. నవాబ్ మాలిక్‌ను సమాధానం కోరింది. వాంఖడేకు సంబంధించి ట్విట్టర్‌లో చేసిన ఆరోపణలు సరైనవో లేదో నిర్ధరణ చేశారా అని ప్రశ్నించింది. కోర్టుకు ప్రశ్నలకు సమాధానంగా నవాబ్ మాలిక్ ప్రమాణపత్రం దాఖలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు.
Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'
Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి