Ramsethu News: రామసేతుకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చిన ఇస్రో, అమెరికా శాట్‌లైట్ సాయంతో తీసిన ఫొటోలు విడుదల
ISRO NEWS: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. నాసా శాటిలైట్ ద్వారా రామసేతు నిర్మాణానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది.
Ram Sethu News: ఎన్నో ఏళ్లుగా వివాదస్పదంగా ఉన్న రామసేత్(Ramsethu) నిర్మాణంపై కీలక ఆధారాలు లభించాయి. వారధి ఉన్న మాట వాస్తవమేనని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలను ఇస్రో సేకరించింది. అమెరికా(America)కు చెందిన నాసా(NASA) శాట్‌లైట్ ద్వారా రామసేతుకు సంబంధించిన కీలక ఫొటోలు సేకరించింది...
రామసేతు వాస్తవమే
రాముడు వానరసేనను వెంటపెట్టుకుని లంకకు చేరుకుని రావణుడిని ఓడించి సీతమ్మను చెరవిడిపించాడని పురాణాలు చెబుతున్నాయి. రాముడు మానవుడే కాబట్టి సముద్రాన్ని దాటలేడని...వానర సైన్యం పెద్దపెద్ద బండరాళ్లతో వారధి నిర్మించిందని రామాయణం చెబుతుంది. అదే ఆడమ్‌బ్రిడ్జి(Aadam Bridge)గా పిలిచే రామసేతు నిర్మాణం. ఇన్ని యుగాలైనప్పటికీ ఇప్పటికీ ఈ నిర్మాణం మనకు కనిపిస్తుంది. భారత్(India), శ్రీలంక(Sri Lanka) మధ్య 29 కిలోమీటర్ల మేర ఉన్న ఈ వారధిపై రకరకాల వాదనలు ఉన్నాయి. అదంతా కల్పితగాథ అని కొందరు..లేదు నిజంగానే అదే రామసేతు నిర్మాణమని కొందరు వాదన. ఎట్టకేలకు ఈ వివాదాన్ని తెరదించుతూ..భారత అంతరికక్ష పరిశోధన సంస్థ (Isro)కీలక ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన నాసా పరిశోధన సంస్థ సాయంతో రామసేతుకు సంబంధించి కీలక ఫొటోలు విడుదల చేసింది. ఇస్రో రూపొందించిన 10 మీటర్ల మ్యాప్‌లో వంతెన మొత్తం కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 ద్వారా ఈ వంతెనను కనుగొన్నారు..
6 ఏళ్ల డేటా సిద్ధం
రామసేతు బ్రిడ్జికి సంబంధించిన 2018 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్‌కు మధ్య ఉన్న డేటాను సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై కృషి చేశారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఈ వంతెన పొడవు దాదాపు 29 కిలోమీటర్లుగా తేల్చారు.సముద్ర గర్భం నుంచి దాదాపు 8 మీటర్ల ఎత్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రామసేతు 99.98 శాతం నీటిలోనే మునిగిపోయి ఉందని మిగిలిన కొద్దిప్రాంతం మాత్రమే బయటకు కనిపిస్తోందని తెలిపారు. ఈ నిర్మాణం తమిళనాడులోని రామేశ్వరం(Rameswaram) సమీపంలో ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపానికి చెందిన తలైమన్నారు వరకు వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.పెద్దపెద్ద రాళ్లు, సున్నం ఉపయోగించి ఈ రామసేతు నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.
ఎన్నో ఏళ్ల కృషి
సాక్షాత్తు శ్రీరాముడు నడిచిన మార్గం కావడంతో ఈ వంతెన భారత్‌కు ఎంతో సెంట్‌మెంట్‌తో ముడిపడని అంశం. అందుకే ఏళ్లతరబడి దీని జాడ కనుగొనేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఇంతకు ముందు జరిపిన పరిశోధనల్లో ఈ వంతెనకు సంబంధించిన బయటకు కనిపించే భాగాలపైనే రీసెర్చ్ చేశారు. ఇప్పుడు తొలిసారి అమెరికాకు చెందిన నాసా సాయంతో సముద్రగర్భంలో మునిగిపోయి ఉన్న వంతెనకు సంబంధించిన వివరాలను ఐస్‌శాట్ శాటిలైట్ సాయంతో కనుగొన్నారు. అధునాతన లేజర్ టెక్నాలజీతో అత్యంత ఖచ్చితమైన ఫొటోలు సంపాదించారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన 1480 వరకు సముద్రమట్టానికి పైనే ఉందని...ఆ తర్వాత తుఫాన్‌ల కారణంగా ధ్వంసమైనట్లు తెలిసింది.
జలరవాణాకు కీలకమార్గం
జలరవాణాకు అత్యంత కీలకమైన పాక్‌జలసంధి ఉన్న ప్రాంతంలోనే రామసేతు నిర్మాణం ఉంది. అంత్యంత ఇరుకుగా ఉన్న ఈ జలరవాణా మార్గాన్ని పెంచాలని..పెద్దపెద్ద ఓడలు తిరిగేలా వెడల్పుచేయాలని భావిస్తుండగా...పలు ధార్మిక సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. రామసేతు నిర్మాణానికి ఎలాంటి భంగా వాటిల్లినా సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి. అయితే రామసేతు నిర్మాణమే లేదని..అదోక ఊహజనితమైన ప్రచారమేనని కొట్టిపారేస్తున్నవారికి ఇప్పుడు ఈ మ్యాప్ సరైన సమాధానం. రాముడు వారధి కట్టింది నిజం...లంకలో రావణాసురిడిని సంహరించింది నిజం...సీతను కాపాడింది నిజమన్న పురాణగాథకు ఇప్పుడు మరింతి బలం చేకూరింది.