అన్వేషించండి

Akash Singh Howrah: బెంగాల్‌లో అంకుశం సీన్లు - రౌడీలందర్నీ నిక్కర్లపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు

Howrah Don paraded: హౌరా డాన్ఆ కాష్ సింగ్‌ను పోలీసులు లోదుస్తులతో వీధుల్లో ఊరేగించారు. పోలీసులపై కాల్పులు, బాంబు దాడులకు పాల్పడినందుకు పోలీసులు ఇచ్చిన సినిమా స్టైల్ ట్రీట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది

West Bengal  Police action on gangster,:  పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హౌరా  డాన్' గా చలామణి అవుతున్న  రౌడీ షీటర్ ఆకాష్ సింగ్‌ను పోలీసులు అతడు భయానక వాతావరణం సృష్టించిన వీధుల్లోనే ఊరేగించారు. కేవలం లోదుస్తులతో, సంకెళ్లు వేసి అతడిని నడిపించుకుంటూ తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రౌడీయిజం చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్పేందుకే పోలీసులు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 బాంబుల వర్షం.. పోలీసులపైనే కాల్పులు 

ఆకాష్ సింగ్ నేర చరిత్ర అత్యంత భయంకరమైనది. 2021లో హౌరాలో గ్యాంగ్ వార్ సమయంలో ఇతడు ఏకంగా పోలీసులపైనే తూటాల వర్షం కురిపించాడు. ఒకే ఘటనలో 20కి పైగా బాంబులు విసిరి ఆ ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చేశాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఇతనిపై హత్యాయత్నం, దోపిడీ, అక్రమ ఆయుధాల సరఫరా వంటి అనేక కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ హౌరాలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ఇతడు ప్రయత్నించాడు. 

 ముగిసిన డాన్ హవా  

చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆకాష్ సింగ్‌ను ఈ నెల ఆరంభంలో ప్రత్యేక పోలీసు బృందాలు పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకున్నాయి. సాధారణంగా నేరగాళ్లను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తారు. కానీ, ఆకాష్ సింగ్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, అలాగే ఇతర నేరగాళ్లకు ఒక గట్టి హెచ్చరిక పంపడానికి పోలీసులు పబ్లిక్ పరేడ్ నిర్వహించారు. 
ఒకప్పుడు ఏ వీధుల్లోనైతే తుపాకులు పట్టుకుని హల్చల్ చేశాడో, అదే వీధుల్లో ఆకాష్ సింగ్‌ను పోలీసులు అర్థనగ్నంగా నడిపించారు. డాన్ అని పిలిపించుకున్న వ్యక్తి ప్రజల ముందు ఇలా నిలబడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పోలీసుల ఈ చర్యతో హౌరాలో నేరగాళ్ల ప్రాబల్యం తగ్గుతుందని, సామాన్యులకు భద్రతా భావం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.   

ఆకాష్ సింగ్ గ్యాంగ్ అందరికీ ఇదే ట్రీట్‌మెంట్ 

 పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పోలీసులు కేవలం ఆకాష్ సింగ్‌ను మాత్రమే కాకుండా, అతడి ముఠాకు చెందిన  మరో నలుగురు సహచరులను కూడా ఇదే రీతిలో వీధుల్లో ఊరేగించారు. హౌరాలోని మలిపంచ్‌ఘరా  పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పేలుళ్లకు పాల్పడిన  ఆకాష్ సింగ్, సుమిత్ సింగ్, అంకిత్ సింగ్,  మరో ఇద్దరు నేరస్థులను  పోలీసులు వరుసగా నిలబెట్టి, అర్థనగ్నంగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నేరస్థుల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మరియు  చట్టం ముందు ఎవరూ డాన్ కాదు అని నిరూపించడానికి హౌరా పోలీసులు ఈ సామూహిక పరేడ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.  నేరం చేస్తే చట్టం ముందు మోకరిల్లక తప్పదు  అనే సందేశాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. నేరగాళ్లను కేవలం జైలుకు పంపడమే కాకుండా, వారి సామాజిక ప్రతిష్ఠను దెబ్బతీయడం ద్వారా నేరాల సంఖ్యను తగ్గించవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఊరేగింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బెంగాల్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ అప్పులపై పొలిటికల్‌ హైడ్రామా! కేటీఆర్, హరీష్‌తో చర్చకు సిద్ధమైన మంత్రులు!
తెలంగాణ అప్పులపై పొలిటికల్‌ హైడ్రామా! కేటీఆర్, హరీష్‌తో చర్చకు సిద్ధమైన మంత్రులు!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Ishan Kishan World No 1 T20I Batter: అభిషేక్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ఇషాన్ కిషన్.. టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ పొజిషన్ కైవ‌సం
అభిషేక్ కి ఝ‌ల‌క్ ఇచ్చిన‌ ఇషాన్ కిషన్.. టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ పొజిషన్ కైవ‌సం
ABP Desam Top 10, 2 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 2 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Meher Ramesh Daughter Wedding: మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
మెహర్ రమేష్ కుమార్తె పెళ్లికి చిరు, వెంకీ అండ్ పవన్... ఘనంగా వివాహ వేడుక
Babymoon Travel Trend : బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
బేబీమూన్ అంటే ఏమిటి? ఇండియాలో ట్రెండ్ అవుతున్న ఈ ట్రిప్‌కు ఎప్పుడు వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి?
IND vs ENG 1st T20 Highlights: వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌ రద్దు! అభిషేక్‌ రికార్డు స్థాయి బ్యాటింగ్! 
Embed widget