Har Ghar Tiranga Movement: ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయండి, దేశ వాసులకు ప్రధాని పిలుపు
Har Ghar Tiranga: ఆగస్టు 13-15 మధ్య తేదీల్లో దేశవాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Har Ghar Tiranga:
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకూ దేశ వాసులందరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని పిలుపునిచ్చారు. "హర్ ఘర్ తిరంగ" (Har Ghar Tiranga)ఉద్యమంలో భాగంగా ఈ పని చేయాలని కోరారు. 1947లో జులై 22వ తేదీన దేశ త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. "దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, స్వేచ్ఛాయుత భారత పతాకాన్ని చూడాలని కలలు కన్న మహనీయులందరినీ తలుచుకోవాల్సిన సందర్భమిది. వారి స్ఫూర్తికి అనుగుణంగా, వారి కలలు నెరవేర్చేందుకు అనుక్షణం ప్రయత్నిస్తాం" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో హర్ ఘర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో
మనకున్న అనుబంధాన్ని ఈ ఉద్యమం ఇంకా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి వరుస ట్వీట్లు చేశారు.
This year, when we are marking Azadi Ka Amrit Mahotsav, let us strengthen the Har Ghar Tiranga Movement. Hoist the Tricolour or display it in your homes between 13th and 15th August. This movement will deepen our connect with the national flag. https://t.co/w36PqW4YV3
— Narendra Modi (@narendramodi) July 22, 2022
Today, 22nd July has a special relevance in our history. It was on this day in 1947 that our National Flag was adopted. Sharing some interesting nuggets from history including details of the committee associated with our Tricolour and the first Tricolour unfurled by Pandit Nehru. pic.twitter.com/qseNetQn4W
— Narendra Modi (@narendramodi) July 22, 2022
Today, we recall the monumental courage and efforts of all those who dreamt of a flag for free India when we were fighting colonial rule. We reiterate our commitment to fulfil their vision and build the India of their dreams. pic.twitter.com/fRcAMVHV9F
— Narendra Modi (@narendramodi) July 22, 2022
Also Read: Male Breast Cancer: రొమ్ముక్యాన్సర్ ఆడవారికే వస్తుందనుకుంటే మీ భ్రమే, మగవారికీ వచ్చే ఛాన్స్, లక్షణాలు ఇలా ఉంటాయి