Happy New Year 2023 Live: షురూ అయిన కొత్త సంవత్సర వేడుకలు, న్యూజిలాండ్‌లో గ్రాండ్ వెల్‌కమ్
Happy New Year 2023 Live: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ కొత్త సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి.
LIVE
Background
Happy New Year 2023 Live
న్యూ ఇయర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే అందరూ కొత్త ఏడాది మూడ్‌లోకి వెళ్లిపోయారు. సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 2022కి గుడ్‌బై చెప్పి..2023కి వెల్‌కమ్ చెప్పేందుకు ఫుల్ జోష్‌తో ఎదురు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ ఏడాది మొట్టమొదటగా కొత్త సంవత్సరం జరుపుకునేది ఎక్కడో తెలుసా..? పసిఫిక్ ద్వీపమైన Tongaలో. పసిఫిక్ ద్వీప దేశాలైన Tonga, Samoa, Kiribati అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త ఏడాదికి స్వాగతం చెప్పనున్నాయి. ఆ తరవాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా 2022కి వీడ్కోలు చెబుతాయి. ఇక అందరి కన్నా ఆలస్యంగా వేడుకలు చేసునేది...Howland, Baker Islands.సిడ్నీ, సింగపూర్, లండన్, దుబాయ్‌లలోని కీలక ప్రాంతాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైపోయాయి. నెటిజన్లు ఇప్పటికే కొత్త ఏడాది స్వింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో Bye Bye 2022 అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు.
We are in the last day of the year and about to finish the chapter of 2022 in our life.
— Believer (@thebeliever__) December 30, 2022
THANK YOU for all beautiful friends who made me smile and shared so much love and positivity.
We'll be moving ahead by collecting memories of 2022. Smile and keep shining 😊💖🥰#goodbye2022 pic.twitter.com/d0Q18Kc8zP
last day of 2022 :-)
— blue water (@moohyungbbi) December 31, 2022
కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సౌత్ కొరియా ప్రజలు. పర్యాటక ప్రదేశాల్లో జనం కిక్కిరిసిపోయారు. సెల్పీలు దిగుతూ న్యూ ఇయర్‌కి స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.The world-famous ‘ball drop’ countdown for New Year’s Eve in New York is a day away and the numeral ‘2023’ has arrived and is ready in Times Square. pic.twitter.com/lpg0teufEI
— CBS Sunday Morning 🌞 (@CBSSunday) December 30, 2022
(Image Credits: Reuters)
న్యూజిలాండ్‌లో కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పారు ప్రజలు. Sky Tower 10 సెకన్ల కౌంట్‌డౌన్ పెట్టి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పటం ఏటా జరిగేదే. ఈ సారి కూడా అదే తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ చేరుకుని కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
Så er det nytår her i Auckland! pic.twitter.com/s5oUdZoY4w
— The US supports the peace process (@AliAdhamDK) December 31, 2022
#HappyNewYear #NZ #2023 #Auckland pic.twitter.com/sls8KGvr85
— Wisdom Iyekekpolo, PhD (@WIyekekpolo) December 31, 2022
కొవిడ్‌తో సతమతమవుతున్నప్పటికీ...చైనాలోనూ కొత్త ఏడాది వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. అన్ని ప్రాంతాలూ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. షాపింగ్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. సాధారణంగా చైనాలో ఏ వేడుకలైనా సరే...లాంథర్లు గాల్లోకి విడిచిపెట్టి ఉత్సవాలు చేసుకుంటారు. ఇప్పుడూ అందుకు రెడీ అయిపోతున్నారు. ఇక సౌత్ కొరియాలోని సియోల్‌లోనూ జోగ్యే టెంపుల్ వద్ద జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బౌద్ధులు నేమ్ కార్డ్స్ అంటించి విషెస్ చెబుతున్నారు.
NEW YEAR'S EVE IN SEOUL
— Concept News Central (@cnc_tribunephl) December 31, 2022
LOOK: Buddhist followers attach name cards with wishes during celebrations for the New Year at Jogye temple in central Seoul on 31 December 2022. | 📸 Jung Yeon-je / AFP #jogyetemple #seoul #newyearseve #DailyTribune pic.twitter.com/XAIl0CfoUa
యూకే ప్రజలకు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని రిషి సునాక్. 2022లో కొవిడ్ కారణంగా ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నామని అన్నారు. 2023లోనూ కొత్త సవాళ్లు ఎదురవుతాయని...కానీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వెల్లడించారు. అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ను ప్రత్యేకంగా నిలిపేందుకు ఈ కొత్త ఏడాది అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2023 will have its challenges, but the government I lead will always put your priorities first.
— Rishi Sunak (@RishiSunak) December 31, 2022
My New Year message 👇 pic.twitter.com/KatjfHHjty
కొత్త సంవత్సరానికి మెగా మాస్ వెల్‌కం
Good Bye 2022 !!
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 31, 2022
Don’t Stop Dancing 🕺 💃
Welcome 2023 !!
Poonakalu Loading !!! 💫💫
Happy New Year to All !! 🎉🎉
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. మెరుగైన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తన సంక్షేమ అభివృద్ధి ఎజెండాను కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.