అన్వేషించండి

Gujarat Election 2022: గుజరాత్‌లో బీజేపీ "ఐడెంటిటీ" కార్డుని వాడేస్తుందా? ఆ రికార్డు అధిగమించటం సాధ్యమేనా?

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఇవే.

Gujarat Election 2022:

వాడివేడి..

గుజరాత్ ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోయినా...అక్కడ అప్పుడే ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. భాజపా, కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నాయి. భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆప్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే...ఈ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే అంశాలు కొన్ని కీలకంగా చర్చకు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నీటి కొరత, జాతీయవాదంతో పాటు గుజరాతీ ఐడెంటిటీ అంశాలు...ఈసారి ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. భాజపాను ఢీకొట్టేందుకు గుజరాత్ ఈ అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకోనుంది. 

ద్రవ్యోల్బణం: 

ఆమ్ఆద్మీ  పార్టీ నమ్ముకున్న అస్త్రం ద్రవ్యోల్బణం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ భాజపాను చుట్టుముట్టాలని చూస్తున్నారు కేజ్రీవాల్. అటు కాంగ్రెస్‌ కూడా ఇదే అంశాన్ని నమ్ముకుంది. అయితే...ఈ ప్రచారాన్ని భాజపా కొట్టి పారేస్తోంది. పైగా.. ఉజ్వల స్కీమ్‌లో భాగంగా లబ్ధిదారు లందరికీ ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో "ద్రవ్యోల్బణం" అంశం మరుగున పడుతుందని బీజేపీ భావిస్తోంది. 

నిరుద్యోగం: 

సాధారణంగా...ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీల హామీల చిట్టాలో "ఉద్యోగాల కల్పన" అనేది తప్పకుండా ఉంటుంది. గుజరాత్ ఎన్నికలు కూడా అందుకు అతీతమేమీ కాదు. ఈ సారి కూడా "యువతకు ఉద్యోగాల కల్పన" అనే అంశం ఎన్నికలను ప్రభావితం చేయనుంది. అందుకే...అటు భాజపా, ఇటు ఆప్ తమ ఎన్నికల హామీల్లో "లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం" అని స్పష్టం చేశాయి. ఆప్ ఇంతటితో ఆగలేదు. గుజరాతీలకు ఉద్యోగుల్లో 80% రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టం చేసింది. 

నీటి కొరత: 

గుజరాత్‌లో నీటి సమస్య కొత్తేమీ కాదు. నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్‌తో కొంత వరకూ ఊరట లభించినా..ఇంకా ఇక్కడి చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తూనే ఉంది. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకే...ఇది ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రంగా మారనుంది. 

గుజరాతీ ఐడెంటిటీ:

భాజపా అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం "గుజరాత్ ఐడెంటిటీ". అంటే స్థానికత పేరు మీద ఓట్లు అడుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావటం వల్ల ఈ ఐడెంటిటీ కార్డ్‌ని తప్పకుండా వినియోగిస్తుంది. ఎవరు స్థానికులు, ఎవరు బయటి వాళ్లు అనే ఎమోషన్‌ను ప్రజల్లో తీసుకురాగలిగితే....అది కచ్చితంగా భాజపాకే ప్లస్ అవుతుంది. ఫలితంగా....ప్రతిపక్షాలు డిఫెన్స్‌లో పడిపోవాల్సి వస్తుంది. 1985లో కాంగ్రెస్ 185 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను మళ్లీ ఎవరూ తిరగరాయలేదు. ఈ ఎన్నికల్లో తాము ఈ రికార్డ్‌ను అధిగమి స్తామని భాజపా చాలా ధీమాగా చెబుతోంది. కానీ..రెండు దశాబ్దాలుగా భాజపా అధికారంలో ఉండటం వల్ల ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండకపోదు. పార్టీలో అంతర్గత కలహాలూ కాషాయ పార్టీని కొంత దెబ్బ తీసే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ చరిష్మా కొంత వరకూ వర్కౌట్ అయినప్పటికీ..అది మాత్రమే విజయ తీరాలకు చేర్చుతుందని భావించలేం. ఏ మాత్రం స్పేస్ దొరికినా...ఆప్భా జపాకు గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ సీట్లు రాబట్టే అవకాశాల్నీ కొట్టి పారేయలేం. 

Also Read: Sachin Pilot On PM Modi: వేడెక్కిన రాజస్థాన్‌ రాజకీయం- గహ్లోత్‌పై సచిన్ పైలట్ డైరెక్ట్ అటాక్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget