Gujarat New Cabinet: గుజరాత్‌లో కొలువుదీరిన కేబినెట్.. రూపానీ వర్గానికి నో ఛాన్స్!
గుజరాత్‌లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మాజీ సీఎం రూపానీ కేబినెట్‌లో వారికి ఎవరికీ ఇందులో స్థానం దక్కలేదు.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని మంత్రివర్గం గురువారం మధ్యాహ్నం కొలువుదీరింది. గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది.
A total of 24 ministers have been sworn in the new cabinet, in the presence of Gujarat Chief Minister Bhupendra Patel and former CM Vijay Rupani. pic.twitter.com/LkzhOECTCg
— ANI (@ANI) September 16, 2021
Governor Acharya Devvrat administers oath to 24 ministers in the new cabinet of Gujarat pic.twitter.com/PH13MaExRP
— ANI (@ANI) September 16, 2021
రాజేంద్ర త్రివేది, జితు వాఘనీ, రిషికేశ్ పటేల్, పునేశ్ మోదీ, రాఘవ్ పటల్ సహా మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా రిషికేశ్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏబీపీ సమాచారం. ప్రస్తుతం నితిన్ పటేల్ ఆ స్థానంలో కొనసాగుతున్నారు.
Gujarat: Swearing-in ceremony of the new Council of Ministers is underway at Raj Bhavan in Gandhinagar, in the presence of Governor Acharya Devvrat. Chief Minister Bhupendra Patel was sworn in earlier this week pic.twitter.com/FfenGTzOaW
— ANI (@ANI) September 16, 2021
ఈరోజు సాయంత్రం కొత్త కేబినెట్ తొలిసారి సమావేశం కానుంది. సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. బుధవారం ఈ ప్రమాణస్వీకారం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది. కొత్త కేబినెట్‌లో పూర్తి స్థాయి మార్పుల కోసం భూపేంద్ర పటేల్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు
అసెంబ్లీ ఎన్నికలు..
15 నెలల తర్వాత గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు కొత్త ఫేస్‌తో వెళ్లాలని భాజపా నిర్ణయించింది. ఇటీవల భాజపా పాలిత రాష్ట్రాల్లో సీఎంలను మారుస్తూ వస్తోంది పార్టీ అధిష్ఠానం.
Also Read: Central Vista Project: నూతన రక్షణ భవనాలను ప్రారంభించిన ప్రధాని