News
News
X

Gold Smuggling: బోల్తా కొట్టిన ప్లాన్, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన ఎయిర్ ఇండియా ఉద్యోగి

Gold Smuggling: ఎయిర్ ఇండియా ఉద్యోగి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు.

FOLLOW US: 
Share:

Gold Smuggling Air India: 

కొచ్చిలో అరెస్ట్..

గోల్డ్ స్మగ్లింగ్‌ ఓ ఇంటర్నేషనల్ బిజినెస్. ఎక్కడెక్కడో బంగారం కొని గుట్టు చప్పుడు కాకుండా ఇండియాకు తీసుకొచ్చేస్తుంటారు. ఈ ప్రాసెస్‌లో ఎయిర్‌పోర్ట్‌లలో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయి ఊచలు లెక్కబెడతారు నేరస్థులు. నిత్యం తనిఖీలు చేస్తూ పెద్ద ఎత్తున గోల్డ్‌ను రికవరీ చేస్తున్నారు అధికారులు. క్రిమినల్స్ ఈ పని చేశారంటే అనుకోవచ్చు. కానీ ఎయిర్ లైన్స్ సిబ్బందే ఇలా స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే..? కొచ్చిలో ఇదే జరిగింది. Air India క్యాబిన్ క్రూ మెంబర్ ఇలా గోల్డ్‌ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. రెండు చేతులకు రేపర్లు చుట్టుకుని గోల్డ్‌ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. బహ్రెయిన్ నుంచి కొచ్చికి వచ్చే ఫ్లైట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. క్యాబిన్ క్రూలోని షఫీ అనే వ్యక్తిని తనిఖీ చేయగా అసలు విషయం బయట పడింది. 1,487 గ్రాముల బంగారాన్ని అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గ్రీన్ ఛానల్ నుంచి నేరుగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఆ వ్యక్తి అధికారులు చెప్పాడు. షర్ట్ స్లీవ్స్‌తో కవర్ చేసి స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేసినట్టు వివరించాడు. ఈ మధ్య కాలంలో ఈ తరహా నేరాలు పెరుగుతున్నాయి. తరచూ ఏదో ఓ ఎయిర్‌పోర్ట్‌లో నేరస్థులను పట్టుకుంటోంది కస్టమ్స్ విభాగం. ఇటీవలే సింగపూర్ నుంచి ఇద్దరు క్రిమినల్స్ 6.8 కిలోల గోల్డ్‌ను అక్రమంగా తరలిస్తుండగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. 

Published at : 09 Mar 2023 12:16 PM (IST) Tags: Air India Gold Smuggling Air India Cabin Crew Shafi Kochi airport

సంబంధిత కథనాలు

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్‌ హాట్‌ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్‌ నెటిజన్స్ ?

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

Stocks to watch 29 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

Weather Latest Update: ఇక తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోనున్న ఎండలు! అంతటా పొడిగానే వాతావరణం

ABP Desam Top 10, 29 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 29 March 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!