Global Water Crisis: ప్రపంచవ్యాప్తంగా నీటికి కటకట, 25 దేశాల్లో వాటర్ ఎమర్జెన్సీ - రిపోర్ట్
Global Water Crisis: ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది.
Global Water Crisis:
నీటి ఎద్దడి..
ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరుగుతోంది. అనూహ్య స్థాయిలో జనాభా పెరగడం, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు లాంటి కారణాలు పలు దేశాల్లో చుక్క నీరు కూడా దొరకని స్థితికి దిగజార్చాయి. వాటర్ మేనేజ్‌మెంట్‌లోనూ పలు దేశాలు వెనకబడుతున్నాయి. త్వరలోనే ప్రపంచమంతా నీటి కొరత సమస్య క్రమంగా విస్తరిస్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అంతా వృథానే. చాలా విధాలుగా సమాజంపై ఈ సమస్య తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వరల్డ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన Aqueduct Water Risk Atlas రిపోర్ట్ ప్రకారం...త్వరలోనే ప్రపంచం వాటర్ ఎమర్జెన్సీని ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే 25 దేశాల్లో ఈ పరిస్థితులు వచ్చేశాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. అంటే...ప్రపంచ జనాభాలో పావు వంతు మంది నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 400 కోట్ల మంది ప్రతి నెలా నీటి వనరులు లేక అవస్థలు పడుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2050 నాటికి ఈ కొరత 60%కి పెరిగే ప్రమాదముంది.
జీడీపీపైనా ప్రభావం..
ఈ ప్రభావం జీడీపీపైనా పడనుంది. 2050 నాటికి నీటి ఎద్దడి కారణంగా..ప్రపంచవ్యాప్తంగా జీడీపీలో 31% మేర ప్రభావానికి గురి కానుంది. అంటే 70 లక్షల కోట్లు. భారత్, మెక్సికో, ఈజిప్ట్, టర్కీలో ఈ సమస్య తీవ్రంగా ఉండే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ప్రస్తుతానికి తీవ్రంగా ప్రభావితమవుతున్న దేశాలలో బహ్రెయిన్, సిప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ఉన్నాయి. ఈ దేశాల్లో కరవు ముంచుకొచ్చే ప్రమాదముంది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో నీటి ఎద్దడి మరీ తీవ్రంగా ఉంది. అక్కడ దాదాపు 83% మంది ప్రజలు నీటి కొరతతో సతమతం అవుతున్నారు. సౌత్ ఆసియాలో 74% మంది అవస్థలు పడుతున్నారు.
"ఈ భూగ్రహంపై అత్యంత కీలకమై వనరు నీరు. కానీ మనం మాత్రం వాటిని జాగ్రత్తగా వాడుకోవడం లేదు. దాదాపు 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి. వాతావరణం మారుతోంది. అదే నీటి ఎద్దడి రూపంలో మన ముందు సవాలుగా నిలుచుంది. పదేళ్లలో ఏ మాత్రం ఉపశమన చర్యలు తీసుకోలేదు. అంతటా ఇదే సమస్య. ఈ సవాలుని అధిగమించడం అత్యవసరం. రాజకీయ నేతలు కట్టుబడి ఉంటే ఇప్పటికైనా మనం మేల్కోవచ్చు. విలువైన నీటి వనరులను కాపాడుకోవాలి. కొన్ని సంస్థలూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇందుకోసం ప్రయత్నించాలి"
- నిపుణులు
ఇటీవలే యునెస్కో ఓ విషయాన్ని వెల్లడించి భారతీయుల గుండెల్లో బాంబు పేల్చింది. మరో పాతికేళ్ల తర్వాత అంటే 2050 నాటికి భారతదేశం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కుంటుందని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వాటర్ డెవలప్ మెంట్ అనే నివేదికలో తెలిపింది. ప్రపంచ పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతుండడంతో.. 2016నో దాదాపు 90 కోట్ల మంది ప్రజలు నీట సమస్యను ఎదుర్కున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి ఈ సంఖ్య పెరుగుతూనే వస్తుందట.ఇలాగే పెరుగుతూ వెళ్తే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుందని యునెస్కో అంచనా వేసింది. దీని వల్ల భారత్ తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని వెల్లడించింది.
Also Read: ITR filing: ఇన్‌కమ్ టాక్స్ రిటర్నుల్లో ఈ 5 రాష్ట్రాలదే సగం వాటా, తెలుగు స్టేట్ ఒక్కటీ లేదు