అన్వేషించండి

Foxconn: ఫాక్స్‌కాన్‌కు మా నుంచి సంపూర్ణ మద్దతు, సంస్థ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy News: తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

Foxconn Representatives meets Revanth Reddy: ప్రపంచంలోనే ప్రముఖ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ‌లో పెట్టబోతున్న పరిశ్రమలు, ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంస్థ ప్రతినిధులు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వీరి భేటీ జరిగింది. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఏర్పాటు చేయబోయే భ‌విష్యత్తు ప్రాజెక్టుల‌కు కావాల్సిన పూర్తి సహకారం తాము అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగ‌ర‌క‌లాన్ నెలకొల్పబోతున్న ఉత్పాద‌క కేంద్రానికి కూడా మద్దతు అందిస్తామని చెప్పారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని.. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని తాము అనుసరిస్తున్నామని అన్నారు.

తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని ప్రభుత్వం ఇంకా వేగవంతం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమల ఏర్పాటు, వాటి విస్తరణకు కావాల్సిన అనుమతులను సులభంగా అందించడంతోపాటు, మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు విధానపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. 

2023 ఏడాది మార్చిలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఉపకరణాలు తయారు చేస్తామని, సదరు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా వాటిలో ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో, వచ్చే రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలు ఈ సంస్థ కల్పించనుంది.

ఫాక్స్‌కాన్ సంస్థ యాపిల్ ఐ ఫోన్లను తయారుచేస్తుంటుంది. ఫాక్స్‌కాన్‌ ప్రధాన క్లైంట్స్ లో గూగుల్, షియోమి, అమెజాన్, అలీబాబా గ్రూప్, సీస్కో, డెల్, ఫేస్‌బుక్‌, సోని, మైక్రోసాఫ్ట్, నోకియా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుంది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్), కర్ణాటకలో (బెంగళూరు) సంస్థకు కర్మాగారాలు ఉన్నాయి.

ఫాక్స్‌కాన్‌ కంపెనీకి కేంద్రం నుంచి 50 శాతం, తెలంగాణ ప్రభుత్వం నుంచి 25 నుంచి 30 శాతం వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు మొదలైన పొరుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అయితే ఇందులో 10 శాతం ఈక్విటీని రాష్ట్రం తీసుకోనుంది.

టాప్ హెడ్ లైన్స్

Telangana Breakfast Scheme: ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్.. టీచర్లు, లెక్చరర్లకు సైతం అమలుకు నిర్ణయం.. మెనూ చూశారా
Vizianagaram Crime News: పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య
పురుగుల మందు తెచ్చి ఇచ్చి లవర్ బ్లాక్ మెయిల్.. నిశ్చితార్థానికి ముందే యువతి ఆత్మహత్య
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 3 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Username Row: వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
వాట్సాప్ తర్వాత యూజర్‌నేమ్ వివాదంలో సిగ్నల్, టెలిగ్రామ్‌లకు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు!
Sierra EV Launch: టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
టాటా సియారా EVతో పోలిస్తే క్రెటా , కర్వ్ EVలు ఎందుకు వెనుకబడింది?
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Embed widget