Imran Khan: మాకు ప్రచారంతో పని లేదు, ఎంత ఆలస్యం చేస్తే మా పార్టీకి అంత మంచిది - ఇమ్రాన్ ఖాన్
Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Imran Khan:
ఎన్నికలపై కామెంట్స్..
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. లాహోర్‌లోని ఓ సభకు హాజరైన ఇమ్రాన్...ఎన్నికలు జరుపుతున్న తీరునీ ప్రస్తావించారు. పాకిస్థాన్‌లోని ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని తీర్చే ఒకే ఒక పరిష్కారం...పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం అని తేల్చి చెప్పారు. దేశంలో సుస్థిరత తీసుకొచ్చి, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచాలన్నా...ఎన్నికలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. "ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలను ఎంత ఆలస్యం చేస్తే...మా పీటీఐ పార్టీకి అంత ప్రయోజనం కలుగుతుంది. మేము ప్రచారం చేయాల్సిన పని లేకుండానే అధికారంలోకి వచ్చేస్తాం" అని చెప్పారు. దేశ స్థితిగతులు మార్చే సమర్థమైన నిర్ణయాలు తీసుకోవాలంటే...భారీ మెజార్టీ సాధించాలని అన్నారు. "దేశాన్ని సరైన దిశలో నడిపించాలంటే...కొత్త ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది" అని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇంకెన్నో చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు.
ఆర్మీ ఆగ్రహం..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరగటం వెనక ఆర్మీ కుట్ర ఉందని Pakistan Tehreek-e-Insaf (PTI) ఆరోపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఓ సీనియర్ ఆర్మీ అధికారి ఈ కుట్ర వెనక ఉన్నారని అన్నారు. ఈ ఆరోపణలపై పాకిస్థాన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. అసత్య ఆరోపణలు చేసినందుకు ఇమ్రాన్‌పై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. Director General Inter-Services
Public Relations (DGISPR)అధికారులు...ఇమ్రాన్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. " ఓ ఉన్నతాధికారిపై నిరాధార, బాధ్యతా రాహిత్య ఆరోపణలు చేసిన కారణంగా చర్యలు తీసుకోవాల్సిందే" అని వెల్లడించారు. "కేవలం ప్రధాని కుర్చీలో కూర్చోవాలనే ఆశతో, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతో సీనియర్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తే తప్పకుండా ఆర్మీ అధికారులకే మేము అండగా నిలుస్తాం. ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం" అని స్పష్టం చేశారు.
కాల్పులు..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా Hakiqi Azadi Marchను అక్టోబర్ 28న ప్రారంభించారు.. ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను వినిపించారు. నిజానికి...ఈ మార్చ్‌పై దాడి జరిగే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగానే ఉన్నాయి. అయినా...దాడి జరిగింది. మరోసారి ప్రధాని కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న ఇమ్రాన్‌పై అటాక్ జరగటం అక్కడ సంచలనమైంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రన్‌వాలాలో వందలాది మంది మద్దతుదారుల మధ్య ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తుండగా దాడి జరిగింది. కొన్ని బుల్లెట్‌లు ఇమ్రాన్ ఖాన్ కాల్లోకి దూసుకుపోయాయి. ఇమ్రాన్ పక్కనే ఉన్న నేతలకూ గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసిన పోలీసులు...విచారణ జరిపారు. ఈ విచారణలో...తాను ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చానని అంగీకరించాడు నిందితుడు. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని అందుకే చంపాలనుకున్నానని వివరించాడు.
Also Read: Viral News: మార్నింగ్ వాక్ కలిపింది ఇద్దరినీ- 70 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!