Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Captain Smit Machchhar Hero:ఫ్లైదుబాయ్ విమానంలో దాడిని అడ్డుకుని 174 మంది ప్రాణాలు కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ వీరగాథ ఇది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.

Indian Pilot Saves Flydubai Flight: మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర కలకలం రేపిన ఒక ప్రధాన వైమానిక భద్రతా ఘటనలో 174 మంది ప్రయాణికుల ప్రాణాలు దక్కాయి. దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం 1073 పై జరిగిన దాడి, దానికి ఒక భారతీయ పైలట్ ఎదురొడ్డి నిలిచిన తీరు అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విమానం గాల్లో ఉండగా కోపైలట్ దాడికి పాల్పడగా, తీవ్ర గాయాలైనప్పటికీ పైలట్ చూపిన తెగింపు వల్లే విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Dear people of India,
— Loay Alshareef لؤي الشريف (@lalshareef) September 30, 2026
Regardless of your faith or beliefs, you are my brothers and sisters in humanity, and I have love and respect for each and every one of you.
What a great nation you are.
I had the honor of becoming friends with your former ambassador to the UAE, Sunjay… pic.twitter.com/nFpMdMxh5o
అంతర్జాతీయ మీడియా , ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. విమానంలోని కాక్‌పిట్‌లో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పై ఒక దుండగుడు అకస్మాత్తుగా చాకుతో దాడి చేశాడు. కెప్టెన్ స్మిత్‌ను తీవ్రంగా పొడవడంతో ఆయన రక్తసిక్తమయ్యారు. అయితే, ఎంతో సమయస్ఫూర్తి, ప్రాణాల కంటే ప్రయాణికుల భద్రతే ముఖ్యం అనుకున్న ఆయన తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేయడంలో విజయం సాధించారు.
Our Embassy in Riyadh and Consulate in Jeddah have been following the health condition of Mr Smit Machchhar, the brave Indian pilot of Flydubai flight that was diverted to Tabuk today. He is admitted in a hospital in Tabuk city in northwest Saudi Arabia and receiving necessary…
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) September 30, 2026
కాక్‌పిట్ డోర్ తెరుచుకోవడంతో వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ ప్రయాణికులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన విమాన సిబ్బంది కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. తీవ్రమైన ఘర్షణ అనంతరం ఆ దుండగుడిని లొంగదీసుకుని, హ్యాండ్‌కఫ్ చేసి బంధించారు. విమానాన్ని సురక్షితంగా సమీప విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను రియల్ హీరోగా కొనియాడింది. భారతీయుడు, ఇజ్రాయెలీ, ఎమిరాటీ.. ఇలా వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తులు ఐక్యంగా నిలబడి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు 174 మంది ప్రాణాలను కాపాడాయి. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని ఇజ్రాయెల్ ప్రకటించింది.
Israel Foreign Ministry (@IsraelMFA) posts: "This man is a hero. Captain Smit Machchhar, the Indian captain of flydubai Flight 1073, fought back after being stabbed in the cockpit. Despite being severely injured, he managed to unlock the cockpit door - allowing Israeli… pic.twitter.com/LNC4YC3OoT
— Press Trust of India (@PTI_News) September 30, 2026
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానయాన భద్రతా సంస్థలు మరియు వివిధ దేశాల ప్రభుత్వాలు ఆయన చూపిన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నాయి. వివిధ దేశాల మధ్య ఉన్న సహకారం, విమాన సిబ్బంది సమర్థతకు ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలిచింది.
Before You Go
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
ట్రెండింగ్ వార్తలు






















