Violence in UP: రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కారు.. ఎనిమిది మంది మృతి!
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్ ఖేరీ జిల్లాలో హింస చెలరేగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించగా పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఏం జరిగింది?
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా లకింపూర్ ఖేరీ జిల్లాల్లోని టికోనియా-బందిపుర్ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ఆ రైతుల మీదకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రమాదం జరిగిన అనంతరం వేలమంది రైతులు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే ఈ ప్రమాదానికి కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. కేంద్ర మంత్రి కుమారిడి వాహనం సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.
కాంగ్రెస్ విమర్శలు..
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
भाजपा देश के किसानों से कितनी नफ़रत करती है? उन्हें जीने का हक नहीं है? यदि वे आवाज उठाएँगे तो उन्हें गोली मार दोगे, गाड़ी चढ़ाकर रौंद दोगे? बहुत हो चुका। ये किसानों का देश है, भाजपा की क्रूर विचारधारा की जागीर नहीं है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 3, 2021
किसान सत्याग्रह मजबूत होगा और किसान की आवाज और बुलंद होगी।
जो इस अमानवीय नरसंहार को देखकर भी चुप है, वो पहले ही मर चुका है।
— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2021
लेकिन हम इस बलिदान को बेकार नहीं होने देंगे- किसान सत्याग्रह ज़िंदाबाद!#FarmersProtest pic.twitter.com/z1NRlGJ8hq