News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kannababu: "వారాహి యాత్రలో పవన్ సినిమాటిక్ హావభావాలు, అభిమానులను అలరించడమే లక్ష్యం" 

Kannababu: వారాహి యాత్రలో పవన్ సినిమాటిక్ హావభావాలు ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. అలాగే అభిమానులను అలరించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపడుతున్నారన్నారు. 

FOLLOW US: 
Share:

Kannababu: సినిమాటిక్ యాత్రలా జనసేన అధినేత పవన్ హావ భావాలు ఉన్నాయని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. అభిమానులును అలరించడానికే పవన్ ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇంత వ్యక్తిగత దూషణలు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేయలేదని అన్నారు. సబ్జెక్ట్ లేకపోతేనే ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకేషనల్ గా రాజకీయాలు చేస్తూ.. బయటకు వస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. సభ్యత లేని భాషతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రశేఖర్ రెడ్డి పై పోటీ చేయాలని చెప్పారు. టీడీపీ ఆవిర్భావంతో కులాలు కుంపట్లు ప్రారంభం అయ్యాయని ఆరోపించారు. ముద్రగడను పరామర్శించడానికి వస్తే.. చిరంజీవిని టీడీపీ ప్రభుత్వం ఎయిర్ పోర్టులో నిర్బంధించిందని గుర్తు చేశారు. 90 శాతం కాపులు జగన్ కి మద్దతు తెలుపుతున్నారు వ్యాఖ్యానించారు. 

ద్వారంపూడిని వెనకేసుకొచ్చిన ముద్రగడ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. పార్టీ పెట్టి పది మంది ప్రేమ పొందాలే కానీ.. ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదుగుతున్నారంటూ పవన్ కల్యామ్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఫైట్ చేశానని చెప్పుకొచ్చారు. నేతలను విమర్శించడం మానేసి పవన్ అసలు విషయాలపై దృష్టి సారించాలని లేఖలో హితవు పలికారు. తాను కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకుడిగా ఎదగలేదన్నారు. తాను యువతను వాడుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టలేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారినప్పడుల్లా తాను ఉద్యమాలు చేయలేదన్నారు. పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ పునరుద్ధరిస్తామనని చంద్రబాబు నాయుడి పదే పదే చెప్పడం వల్ల రోడ్డు మీదకు వచ్చామన్నారు. ఈ పరిస్థితిని బాబు ద్వారా పవన్ కల్పించారని ఆరోపించారు. తాను ఏ నాయకుడినీ బెదిరించి డబ్బులు సంపాదించలేదని చెప్పారు.

Read Also: ఒకరిని విమర్శిస్తే మరొకరి రియాక్షన్ - ఏపీ రాజకీయాల్లో ఎవరికెవరు ?

ఎమ్మెల్యేని తిట్టడం ఆపేసి.. ఆ సమస్యలపై దృష్టి పెట్టండి!

తన కంటే చాలా బలవంతుడైన పవన్ కల్యాణ్ తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఫలాలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు. ఎమ్మెల్యేని తిట్టడం ఆపేసి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం, ప్రత్యేక రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వగైరా సమస్యలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. జనసేనానికి నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే వీటిపై యుద్ధం చేయండంటూ కోరారు. తన లాంటి అనాథల మీద విమర్శలు చేయడం సరికాదని సూచించారు.

పార్టీ పెట్టిన తర్వాత పదిమంది ప్రేమ పొందాలే కానీ వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంత వరకూ న్యాయమంటారని అడిగారు. అలాగే రాజకీయాల్లో అతి సామాన్యుడు తాలూకు ఇంటికి వెళ్లి ఓట్లు అడుక్కోవాలని... ఉద్యామాలకు అయితే ఎవరి ఇంటికి వెళ్లి సాయం చేయాలని అడగాల్సిన అవసరం లేదన్నారు. మనం చేసే ఉద్యమం మంచి కోసం చేస్తే కులాలకు అతీతంగా బలపరిచేవారు చాలా మంది ఉన్నారని తెలిపారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 20 Jun 2023 05:55 PM (IST) Tags: AP News AP Politics Varahi Yatra Ex Minister Kannababu Kannababu on Pawan kalyan

ఇవి కూడా చూడండి

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

జేఈఈ మెయిన్ దరఖాస్తుకు ముగుస్తోన్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

Bandi Sanjay: కరీంనగర్ లో ఓటుకు రూ.10 వేలు పంచిన బీఆర్ఎస్- ఆధారాలు చూపించిన బండి సంజయ్

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల

KVS Recruitment: కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

ID Cards for Polling: ఓటు వేసేందుకు ఏదైనా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు, పోలింగ్ కేంద్రాలకు అలా వెళ్లకూడదు

ID Cards for Polling: ఓటు వేసేందుకు ఏదైనా ఒక ఐడీ కార్డు ఉంటే చాలు, పోలింగ్ కేంద్రాలకు అలా వెళ్లకూడదు

టాప్ స్టోరీస్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND Vs AUS, Match Highlights:  మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు