News
News
X

Twitter Subscription Launch: బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ షురూ, ప్రకటించిన ఎలన్ మస్క్

Twitter Subscription Launch: ట్విటర్‌ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్టు మస్క్ ప్రకటించారు.

FOLLOW US: 

Twitter Subscription Launch:

నవంబర్ 29న రీస్టార్ట్..

ట్విటర్ బ్లూ టిక్‌పై సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో చర్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. బ్లూటిక్ మెయింటేన్ చేయాలంటే తప్పనిసరిగా నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని కండీషన్ పెట్టాడు ఎలన్ మస్క్. అయితే...కొందరు హ్యాకర్లు ఫేక్ అకౌంట్లు సృష్టించి ట్విటర్‌కు తలనొప్పి తెచ్చి పెట్టారు. పైగా వాటికి బ్లూటిక్‌ కూడా ఉన్నట్టు క్రియేట్ చేశారు. అమెరికాలో అయితే...ఫేక్ అకౌంట్‌లు క్రియేట్ చేసిన వాళ్లు కూడా బ్లూ టిక్‌ కోసం 8 డాలర్లు చెల్లించారు. ఆ తరవాత కానీ..అవి నకిలీ అని తేలలేదు. మొత్తానికి ఇది మస్క్‌ను ఇరకాటంలో పడేసింది. 
ఈ పెయిడ్ ఫీచర్ ఉంచుదామా తీసేద్దామా అనే ఆలోచనలో పడి..చివరకు కొద్ది రోజుల పాటు ఈ సర్వీస్‌ను నిలిపివేశారు. ఫేక్ అకౌంట్‌ల లెక్క తేల్చిన మస్క్ మామ...ఆ పని పూర్తి చేసిన వెంటనే ఓ ప్రకటన చేశాడు. ట్విటర్ బ్లూటిక్ పెయిడ్ ఫీచర్‌ను రీస్టార్ట్ చేస్తున్నట్టు వెల్లడించాడు. ఇదే విషయాన్ని ట్వీట్‌ చేశాడు. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సర్వీస్‌ను మళ్లీ ప్రారంభిస్తామని చెప్పాడు. ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి ఈ పెయిడ్ ఫీచర్‌పై హింట్ ఇస్తూనే వచ్చారు ఎలన్ మస్క్. కానీ...మధ్యలో ఈ అవాంతరాల వల్ల ఆపేయాల్సి వచ్చింది. నిజానికి..గత వారమే మస్క్...దీనిపై క్లారిటీ ఇచ్చారు. "బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ ఎప్పుడు మొదలు పెడతారు" అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు "వచ్చే వారంలోగా" అని సమాధానమిచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ప్రకటన చేశారు. 

లేఆఫ్‌లు..

 ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే చాలా మంది ఉద్యోగులను తీసేసిన మస్క్.. లేఆఫ్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు కొనసాగినట్లు సమాచారం. ట్విట్టర్‌కు చెందిన కంటెంట్‌ మోడరేషన్, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. అయితే వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశారట. కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.

Also Read: Shoaib Malik Sania Mirza: ఓవైపు విడాకుల వార్తలు, మరోవైపు శుభాకాంక్షలు - సానియా, మాలిక్ మధ్య అసలేం జరుగుతోంది!

Published at : 16 Nov 2022 11:33 AM (IST) Tags: Elon Musk Blue Tick Twitter Subscription Launch Twitter Subscription

సంబంధిత కథనాలు

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Bengaluru Crime News: డబ్బుతో ఉడాయించిన ATM సెక్యూరిటీ గార్డు, గర్ల్‌ఫ్రెండ్‌తో పెళ్లి ఖర్చుల కోసమట

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Kerala Govt: కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేరళ సర్కార్- గవర్నర్‌ను తప్పించేందుకు!

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

Mulugu Agency: మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్ల కలకలం - ఆరుగురు మిలీషియా సభ్యుల అరెస్ట్

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

డేటింగ్ యాప్స్‌ను బాగా వాడేస్తున్న చైనా ప్రజలు, ఎందుకోసమంటే?

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

Hyderabad News: కొంపముంచిన క్రిప్టో కరెన్సీ - 27 లక్షల రూపాయలు స్వాహా!

టాప్ స్టోరీస్

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్

Lucky Lakshman Teaser : లక్ష్మణ్ గారి లక్ ఎంత? పాన్ ఇండియా రూటులో 'బిగ్ బాస్' సోహైల్