ట్విటర్‌కి కేంద్రం మరోసారి నోటీసులు, భారీ పెనాల్టీ వేస్తామని వార్నింగ్
Twitter Vs Central Govt: ట్విటర్‌కి, కేంద్ర ప్రభుత్వానికి మరోసారి విభేదాలు మొదలయ్యాయి.

X Vs Central Govt: ఎలన్ మస్క్ X వర్సెస్ కేంద్ర ప్రభుత్వం గొడవ కొనసాగుతూనే ఉంది. తమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని చాలా సార్లు కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి Xకి నోటీసులు పంపింది. దీనిపై X కి సంబంధించిన Global Government Affairs మండి పడింది. కొన్ని అకౌంట్స్‌పై ఆంక్షలు విధించింది. వాటిని కేంద్రం హోల్డ్‌లో పెట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛకి ఇది భంగం కలిగిస్తోందని వాదిస్తోంది. అర్ధరాత్రి 1.04 కి ఈ నోటీసులు వచ్చినట్టు వివరించింది. పైగా ఈ నోటీసులో పారదర్శకత కనిపించడం లేదని స్పష్టం చేసింది. కొన్ని న్యాయపరమైన అడ్డంకుల కారణంగా అందులో ఏముందో పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నామని వెల్లడించింది. ఏదేమైనా ఈ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటిస్తామని వివరించింది.
"కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటాం. భారత్‌లో మాత్రం ఆ అకౌంట్స్‌ని హోల్డ్‌లో పెట్టేస్తాం. కానీ...కేంద్రం నోటీసుల మాత్రం ఖండిస్తున్నాం. అన్ని పోస్ట్‌లకీ భావ ప్రకటనా స్వేచ్ఛను పాటించేలా చూసుకుంటాం. ఇది మా విధానం"
- X యాజమాన్యం
The Indian government has issued executive orders requiring X to act on specific accounts and posts, subject to potential penalties including significant fines and imprisonment.
— Global Government Affairs (@GlobalAffairs) February 21, 2024
In compliance with the orders, we will withhold these accounts and posts in India alone; however,…
అటు కేంద్రం మాత్రం కచ్చితంగా ఆ అకౌంట్‌లపై నిఘా ఉండాల్సిందేనని తేల్చి చెబుతోంది. పోస్ట్‌లనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు తప్పవని వెల్లడించింది. కొన్ని సార్లు జైలు శిక్ష కూడా తప్పదని అంటోంది.
Before You Go
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















