వెయ్యి డాలర్లు కట్టాకే మా దేశంలో అడుగు పెట్టండి - ఇండియన్స్‌కి షాక్ ఇచ్చిన ప్రభుత్వం
El Salvador Tax: భారత్, ఆఫ్రికా నుంచి వచ్చే వాళ్లు వెయ్యి డాలర్లు కట్టాల్సిందేనని ఎల్ సాల్వడార్ ప్రకటించింది.
El Salvador Tourism Tax:
ఎల్ సాల్వడార్ ఆంక్షలు..
ఎల్ సాల్వడార్ (El Salvador) దేశం ఆఫ్రికా, భారత్ టూరిస్ట్‌లకు షాక్ ఇచ్చింది. తమ దేశానికి రావాలనుకుంటున్న వారు వెయ్యి డాలర్ల రుసుము కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ రెండు దేశాల నుంచి ఎవరు వచ్చినా ఈ ఫీజ్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. తమ దేశం నుంచి అమెరికాకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు 50కి పైగా ఆఫ్రికన్ దేశాల పౌరులు ఈ ఫీజు చెల్లించాలని ప్రకటించింది. అక్టోబర్ 20న ఎల్ సాల్వడార్ పోర్ట్ అథారిటీ తన వెబ్‌సైట్‌లో ఈ స్టేట్‌మెంట్‌ని పబ్లిష్ చేసింది. ఈ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బుల్ని దేశంలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ని డెవలప్ చేసేందుకు వినియోగించనున్నట్టు తెలిపింది. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ( Nayib Bukele) ఇప్పటికే అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రియాన్ నికోలస్‌తో భేటీ అయ్యారు. వలసల్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. అమెరికా చెబుతున్న లెక్కల ప్రకారం...ఈ ఆర్థిక సంవత్సరంలోనే 32 లక్షల మంది అమెరికాలోకి వలస వచ్చారు. వీళ్లలో ఎక్కువ మంది ఆఫ్రికా దేశాల నుంచే ఉన్నారు. అది కూడా సెంట్రల్ అమెరికా మీదుగా అమెరికా వెళ్తున్నారు. ముఖ్యంగా ఎల్ సాల్విడార్ నుంచే వలసలు పెరుగుతున్నాయి. అందుకే...ఆంక్షలు విధించింది ఈ ప్రభుత్వం.
Had an excellent meeting with @nayibbukele. We discussed El Salvador’s support for the international mission in Haiti, efforts to promote foreign direct investment in El Salvador, bilateral cooperation on rule of law, and mutual efforts to address irregular migration. -BAN pic.twitter.com/cLcCOHYlAT
— Brian A. Nichols (@WHAAsstSecty) October 26, 2023
వ్యాట్‌తో కలుపుకుని..
భారత్, అమెరికా నుంచి వచ్చే వాళ్లు VATతో కలుపుకుని 1,130 డాలర్లు మేర చెల్లించాలని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎల్ సాల్విడార్‌లోని ఎయిర్‌పోర్ట్‌కీ ఫ్లోటింగ్ పెరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అయితే...ఏయే దేశాల నుంచి ఎంత మంది ప్రయాణికులు వస్తున్నారో ఎయిర్‌లైన్స్ అధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుంది. భారత్, ఆఫ్రికాను కలుపుకుని మొత్తం 57 దేశాల జాబితాను సిద్ధం చేసింది. ఈ దేశాల నుంచి ఎవరు వచ్చినా ముక్కు పిండి ఫీజు వసూలు చేస్తుంది. కొలంబియన్ ఎయిర్‌లైన్స్ కూడా ఇప్పటికే ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ఎల్‌సాల్వడార్‌కి వెళ్లాలనుకునే వాళ్లు కచ్చితంగా ఫీజు చెల్లించాలని ప్రకటించింది.