News
News
X

Droupadi Murmu: ద్రౌపది ముర్ము గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ద్రౌపది ముర్ము జీవితంలో ఎన్నో విషాదాలు దాటుకుని వచ్చారు. స్ఫూర్తిమంతమైన నేతగా నిలిచారు.

FOLLOW US: 

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎప్పుడైతే ఎన్‌డీఏ ప్రకటించిందో అప్పటి నుంచి ఆమె గెలుపు ఖాయమేననే మాట బాగా వినిపించింది. యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఒకానొక సమయంలో ముర్ముకి మద్దతుగానే మాట్లాడారు. ఆమె విజయం ఇక లాంఛనమే అనిపిస్తోంది. ఝార్ఖండ్ గవర్నర్‌గా పని చేసిన ద్రౌపది ముర్ము జీవితంలో ఎన్నో విషాదాలను దాటుకుని వచ్చారు. వాటిని తట్టుకుని మళ్లీ నిలబడ్డారు. అందుకే ఆమెను "స్ఫూర్తిమంతమైన" నేత అని ఎన్‌డీయే మొదటి నుంచి ప్రశంసిస్తూ వస్తోంది. 

ద్రౌపది ముర్ము జీవితంలో విషాదాలివే..

1.2009-14 వరకూ ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇద్దరు కొడుకులను, భర్తను కోల్పోయారు. తరవాత ఆమె తల్లి, సోదరుడు కూడా మరణించారు. 

2.2009లో ద్రౌపది ముర్ము పెద్ద కొడుకు అనుమానాస్పదంగా మృతి చెందాడు. లక్ష్మణ్ ముర్ముని అతని బెడ్‌పై అపస్మారక స్థితిలో గుర్తించారు. 2012లో రెండో కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. 

3. 2014లో ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరమ్ ముర్ము కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందారు. 

4. ద్రౌపది ముర్ము కూతురు ఇతిశ్రీ ముర్ము ఓ బ్యాంక్ ఉద్యోగి. ఆమె ఓ రగ్బీ ప్లేయర్‌ను వివాహం చేసుకున్నారు. 

5. రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు ద్రౌపది ముర్ము టీచర్‌గా పని చేశారు. ఒడిశాలోని రాయ్‌రంగపూర్‌లో శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో టీచర్‌గా విధులు నిర్వర్తించారు. 

ఆమె జీవితం స్ఫూర్తిదాయకం..

ద్రౌపది ముర్ము ఎన్నో సమస్యలు దాటుకుని పట్టుదలగా నిలబడ్డారని సన్నిహితులు చెబుతుంటారు. "మా కాలంలో అమ్మాయిలకు 
చదువులెందుకు అని ప్రశ్నించేవారు. చదువుకుని ఏం చేస్తావని హేళన చేసేవారు. ఆ ప్రశ్నలన్నింటికీ ద్రౌపది సరైన సమాధానమిచ్చింది" 
అని ద్రౌపది ముర్ము బంధువులు గర్వపడుతున్నారు. "మహిళ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ముర్ము నిరూపించారు. ఆమె ఏదీ ఓ పట్టాన ఒప్పుకోరు. లోతైన అధ్యయనం చేస్తారు. మాకు ఆమెతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆమె నుంచి మేమెంతో నేర్చుకున్నాం. మహిళలు సాధించలేనిది ఏదీ లేదు అనటానికి ఆమె జీవితమే నిదర్శనం" అని ముర్ముతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ తీన్‌ మూర్తి మార్గ్‌లోని ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపే అవకాశముంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఆమె విజయోత్సవాలను ప్లాన్ చేసుకుంది భాజపా. ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే సంబరాలు ప్రారంభం కానున్నాయి. ముర్ము సొంత ఊరు రాయ్‌రంగపూర్‌ ప్రజలు ద్రౌపది ముర్ము విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు. 20వేల స్వీట్లతో వేడుకలు జరపనున్నారు. 

Published at : 21 Jul 2022 02:13 PM (IST) Tags: Droupadi Murmu Droupadi Murmu Interesting Facts Droupadi Murmu Family

సంబంధిత కథనాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్‌- కాలేజీలకు కీలక ఆదేశాలు

HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

HORTICET - 2022:  ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

AP Agri Gold  :   ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..

Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..