(Source: ECI/ABP News/ABP Majha)
Donald Trump's daughter: డొనాల్డ్ ట్రంప్ కూతురు పెళ్లి- వరుడు ఎవరంటే?
Donald Trump's daughter: డొనాల్డ్ ట్రంప్ కూతురు వివాహం.. శనివారం జరిగింది.
Donald Trump's daughter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూతురు టిఫానీ (Tiffany) ట్రంప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్ మైఖెల్ బౌలస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.
ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది. ట్రంప్ దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించారు. ట్రంప్ తొలి భార్య మార్లా మేపుల్స్‌కు జన్మించిన సంతానమే టిఫానీ.
PHOTOS: Trump’s Daughter, Tiffany, Marries fiancé, Micheal
— Punch Newspapers (@MobilePunch) November 13, 2022
Tifanny, one of the daughters of the former United States President , Donald Trump, tied the knot with her fiancé, Michael Boulos on Saturday at Mar-a-Lago in Palm Beach, Florida. pic.twitter.com/rtfjZ1Bk0K
ఇలా సాగింది
ట్రంప్.. తన కూతురు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే హాజరయ్యారు. ట్రంప్ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త ఈ వేడుకలో పాల్గొన్నారు.
మళ్లీ బరిలోకి
డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాలో రిపబ్లికన్ హిందూ కూటమి (ఆర్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తాను పోటీ చేసే అవకాశం ఉందని డొనాల్ట్ ట్రంప్ అన్నారు.
" మాకు హిందూ జనాభా నుంచి రెండు సార్లు (2016, 2020) ఎన్నికల్లో గొప్ప మద్దతు లభించింది. భారత ప్రజలు ఎప్పుడూ నాకు మద్దతు పలుకుతూనే ఉన్నారు. కీలకమైన రాష్ట్రాల్లో హిందూ ఓటర్లు అందించిన మద్దతుతోనే నేను 2016లో అధ్యక్ష పీఠం అధిరోహించాను. వాషింగ్టన్ డీసీలో హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని నిర్మించాలనే ఆలోచనను నేను పూర్తిగా ఆమోదించాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పూర్తి చేస్తాం. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే భారత్- అమెరికా సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్తాను. నేను నెగ్గితే ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపకుడు శలభ్‌కుమార్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తాను. అయితే పోటీ చేసే విషయంలో నేనింకా నిర్ణయం తీసుకోలేదు. "