Doha IndiGo Flight: ఇండిగో ఫ్లైట్‌లో మెడికల్ ఎమర్జెన్సీ, కరాచీలో ల్యాండ్ అయిన విమానం - ప్యాసింజర్ మృతి
Doha IndiGo Flight: ఢిల్లీ నుంచి దోహా వెళ్తున్న ఫ్లైట్‌ను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కరాచీలో ల్యాండ్ చేశారు.
Doha IndiGo Flight:
ఢిల్లీ-దోహా ఫ్లైట్‌లో..
ఢిల్లీ నుంచి దోహాకు వస్తున్న IndiGo ఫ్లైట్‌ను అత్యవసరంగా పాకిస్థాన్‌లోని కరాచీ ఎయిర్ పోర్ట్‌కు డైవర్ట్ చేశారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే...ల్యాండ్ అయ్యే సమయానికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది ఇండిగో యాజమాన్యం. చాలా మంది ఈ ఘటనపై ట్వీట్‌లు చేశారు. మృతి చెందిన వ్యక్తి నైజీరియన్ అని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
"మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. దురదృష్టవశాత్తూ ల్యాండ్ అయ్యే సమయానికే ఆ ప్రయాణికుడు చనిపోయినట్టు ఎయిర్‌పోర్ట్ మెడికల్ టీమ్ వెల్లడించింది. ఇలా జరగటం ఎంతో బాధాకరం. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మా ప్రగాఢ సానుభూతి. ప్రస్తుతానికి మిగతా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం"
-ఇండిగో ఎయిర్ లైన్స్
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఈ మధ్య యూరినేషన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆ తరవాత కంపెనీ అలెర్ట్ అయింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. దీనిపై ఇంకా చర్చ జరుగుతుండగానే మళ్లీ వార్తల్లో నిలిచింది Air India.
లండన్ నుంచి ముంబయికి వస్తున్న ఫ్లైట్‌లో ఓ 37 ఏళ్ల వ్యక్తి బాత్‌రూమ్‌లో సిగరెట్ తాగడం కలకలం రేపింది. రమాకాంత్ అనే వ్యక్తి సిగరెట్ తాగడమే కాకుండా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కంపెనీ ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్లైట్‌లో సిగరెట్ తాగేందుకు అనుమతి లేదని, చెప్పినా వినకుండా ఆ వ్యక్తి అందరినీ ఇబ్బందికి గురి చేశాడని ఎయిర్ ఇండియా సిబ్బంది వెల్లడించింది.
"ఫ్లైట్‌లో స్మోకింగ్‌కు అనుమతి లేదు. కానీ ఆయన బాత్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించారు. వెంటనే అలారం మోగింది. మేమంతా అలెర్ట్ అయ్యి బాత్‌రూమ్ వైపు వెళ్లాం. ఆయన చేతిలో సిగరెట్ ఉంది. మేం ఆ సిగరెట్‌ను లాగేసుకుని పారేశాం. ఇలా చేసినందుకు ఆయన మాపై అరవడం మొదలు పెట్టాడు. ఏదో విధంగా నచ్చజెప్పి ఆయన సీట్‌లో కూర్చోబెట్టాం. కాసేపటి తరవాత ఉన్నట్టుండి లేచి ఫ్లైట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. అది చూసి తోటి ప్రయాణికులంతా భయపడిపోయారు. మేం ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. గట్టిగా అరుస్తున్నాడు. చేసేదేమీ లేక మేము ఆయనను గట్టిగా పట్టుకుని చేతులు కాళ్లు కట్టేశాం. మళ్లీ కుర్చీలో బలవంతంగా కూర్చోబెట్టాం"
-ఎయిర్ ఇండియా సిబ్బంది
Emergency landing of an Indian airline in #Karachi, the pilot took permission to land when the passenger's condition worsened, the passenger died before landing. #Indigo #India pic.twitter.com/gkVIxgdRnK
— Bilal Naseer (@BNKoffical) March 12, 2023
అలా కాళ్లు చేతులు కట్టేసి కూర్చోబెట్టినా ఆ వ్యక్తి ఊరుకోలేదని సీట్‌కు తన తలను కొట్టుకోవడం మొదలు పెట్టాడని చెప్పింది ఫ్లైట్ సిబ్బంది.
Also Read: రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం, క్షమాపణలు చెప్పాలంటూ రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ - ఉభయ సభలు వాయిదా