Desh Ka Mahaul Remark: 'మన దేశంలోనే మైనార్టీలకు రక్షణ ఉంది- వేరే దేశాల్లో తెలుసుగా'
Desh Ka Mahaul Remark: దేశంలో మైనార్టీలకు కూడా రక్షణ ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు.
Desh Ka Mahaul Remark: భారత్‌లో పరిస్థితులు బాగోలేవంటూ ఆర్‌జేడీకి చెందిన అబ్దుల్ బారీ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పందించారు. ప్రపంచ దేశాలన్నింటిలో కేవలం భారతదేశంలోనే ప్రజలంతా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఇక్కడ మైనార్టీలకు కూడా రక్షణ దొరుకుతోందన్నారు.
రాహుల్‌పై
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై కూడా నిత్యానంద్ రాయ్ విమర్శలు చేశారు."భారత్ జోడో యాత్ర"లో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలలో ఆయన మన సాయుధ బలగాలను కించపరిచారని అన్నారు.
ఏమన్నారు?
దేశంలో పరిస్థితులు బాగోలేవని.. అందుకే తన పిల్లల్ని విదేశాల్లో స్థిరపడాలని సూచించినట్లు ఇటీవల ఆర్‌జేడీ నేత సిద్దిఖీ అన్నారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Karnataka Covid Guidelines: 'ఇక మాస్కులు తప్పనిసరి- న్యూయర్ వేడుకలపై కూడా ఆంక్షలు'