By: ABP Desam | Updated at : 01 Feb 2023 02:12 PM (IST)
Edited By: jyothi
బడ్జెట్ 2023లో రక్షణ శాఖకు కేటాయింపులను భారీగా పెంచిన సర్కారు
Defence Budget 2023: చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం రక్షణ బడ్జెట్‌ను సుమారు 70 వేల కోట్ల రూపాయల మేర పెంచింది. 2023-24కి గాను ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.5.94 లక్షల కోట్లు కేటాయించింది. బడ్జెట్‌లో ఎక్కువ భాగం జవాన్లకు అవసరమైన ప్రాథమిక అభివృద్ధికే వినియోగిస్తారు.
2022-23లో రక్షణ బడ్జెట్ ఎంత?
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం భద్రత బడ్జెట్‌ను 9.86 శాతం పెంచింది. ఆర్మీ సిబ్బంది జీతాలు, ఇతర రక్షణ వ్యయాలను పెంచడానికి ప్రభుత్వం ఎక్కువగా 2022 బడ్జెట్‌లో 47 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 2022-23లో రక్షణ బడ్జెట్ రూ.5.25 లక్షల కోట్లు.
ఐదేళ్లలో రక్షణ బడ్జెట్ ఎప్పుడు, ఎంత పెరిగింది?
2019- 20 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 4.31 లక్షల కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 4.71 లక్షల కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 4.78 లక్షల కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 5.25 లక్షల కోట్లు
బడ్జెట్ కోతలను మందలించిన పార్లమెంటరీ కమిటీ
2022వ సంవత్సరం మే నెలలో పార్లమెంటు రక్షణ కమిటీ ఒక నివేదికను విడుదల చేసింది. 1962 తర్వాత 2022లో రక్షణ బడ్జెట్‌ను ప్రభుత్వం స్వల్పంగా తగ్గించిందని నివేదికలో పేర్కొన్నారు. భారత సైన్యం రెండు కోణాల్లో పోరాడుతోందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి పరిస్థితిలో బడ్జెట్‌ను తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాపిటల్ హెడ్ కింద వచ్చిన మొత్తం తగ్గింపుపై కూడా కమిటీ ప్రశ్నలు లేవనెత్తింది. దీని కింద ఆర్మీ ఆయుధాలు కొనుగోలు చేస్తారని గుర్తు చేసింది.
మొత్తం బడ్జెట్ లో 1 శాతం కంటే తక్కువ
పార్లమెంటు రక్షణ కమిటీ ప్రకారం.. భారతదేశంలో సైనిక, సంబంధిత పరిశోధన పనుల కోసం మొత్తం బడ్జెట్‌లో 1 శాతం కంటే తక్కువ ఖర్చు చేశారు. మరోవైపు శత్రు దేశం చైనా మొత్తం రక్షణ బడ్జెట్‌లో 20% భద్రతకు సంబంధించిన పరిశోధనలకే వెచ్చిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్‌లో భారీగా పెంచారు.
Breaking News Live Telugu Updates: హన్మకొండ జిల్లాలో ఆటో-కారు ఢీ, పలువురి పరిస్థితి విషమం
AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!
Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!
నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్
చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్ హాట్ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్ నెటిజన్స్ ?
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!