Viral Video: నడిరోడ్డుపై భారీ మొసలి, భయపడిపోయిన వాహనదారులు - వీడియో వైరల్
Viral Video: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ మొసలి నదిలో నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. దాన్ని చూసి వాహనదారులు షాక్ అయ్యారు.
Crocodile Roaming on Road: మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. నది కూడా ఉప్పొంగింది. ఆ సమయంలోనే వరద నీటిలో నుంచి ఓ భారీ మొసలి కొట్టుకొచ్చింది. కాసేపటి తరవాత నడిరోడ్డుపై కనిపించింది. వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కార్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఆ మొసలిని వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా శివా నది నుంచి రోడ్డుపైకి వచ్చుంటుందని భావిస్తున్నారు. ఆ నదిలో మొసళ్ల సంఖ్య ఎక్కువ అని స్థానికులు చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండి అంత భారీ మొసలి రోడ్డుపైన పాకుతూ కనిపించే సరికి అంతా కంగుతిన్నారు. ఈ మొసలి పొడవు 8 అడుగుల వరకూ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Full grown Indian Crocodile aka Maggar was seen wandering the streets of Ratnagiri, Maharashtra.
— India Strikes YT (@IndiaStrikes_) July 1, 2024
---------------------------
For once, it felt like saying to the car driver, "Hey, I'm walking here..." And the car driver stopped and backed the f off - Croc Pacino😂 pic.twitter.com/jgsxBM7Ty2
గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. వడోదరలో విశ్వామిత్రి నదిలో నుంచి ఓ మొసలి బయటకు వచ్చింది. భారీ వర్షాలకు నీళ్లలో నుంచి బయటకు కొట్టుకొచ్చింది. 12 అడుగులు భారీ మొసలిని చూసి అందరూ వణికిపోయారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ తరవాత స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమై ఆ మొసలిని నిర్బంధించి నదిలోకి వదిలారు.