Kerala MLA Rahul: కాంగ్రెస్ నుంచి రాహుల్ సస్పెన్షన్ - సినీ నటికి లైంగిక వేధింపులు -తప్పలేదు !
MLA Rahul: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ సినీ నటి చేసిన ఆరోపణలతో కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాహుల్ మామకుత్తిల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Congress suspends Kerala MLA Rahul Mamkootathil: కేరళలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు , ప్రస్తుత ఎమ్మెల్యే రాహుల్ మామకుత్తిల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేరళ సినీ పరిశ్రమలో వర్థమాన నటిగా ఉన్న రినా జార్జ్ అనే యువతిని ఆయన వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేరళలో యువ కాంగ్రెస్ నేతగా, మంచి భవిష్యత్ ఉన్న లీడర్ గా గుర్తింపు పొందారు. కేరళ కాంగ్రెస్ పార్టీ యువత విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. పాలక్కాడ్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.
కొద్ది రోజుల కిందట రీని జార్జ్ అనే నటి తనను జాతీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తీవ్రంగా వేధిస్తున్నారని మూడేళ్ల నుంచి ఆ వేధింపులు భరించలేకపోతున్నానని మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. టెలిగ్రామ్ , సోషల్ మీడియా ద్వారా రీని జార్జ్‌కు అశ్లీలమైన సందేశాలు పంపినట్లుగా ఆరోపించారు. తాను హెచ్చరించినా ఆగలేదని.. హోటల్ రూమ్‌కు రావాలని అక్కడ "ప్రైవేట్ మీటింగ్" జరుపుకుందామని ఓ సారి ఆహ్వానించాడని రినీ జార్జ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తిరస్కరించడంతో వేధింపులను ఇంకా పెంచాడని ... లేట్ నైట్ కాల్స్, లైంగిక వేధింపుల చాట్ చేయాలని ఒత్తిడి చేశాడన ిఆరోపించారు.
Malayalam actress and journalist #RiniAnnGeorge accuses a young politician of sending her offensive messages, with rumors pointing to Kerala #Congress MLA Rahul Mamkootathil, though she hasn't named him. She also claims the politician invited her to a hotel and dared her to… pic.twitter.com/TfikwJG8ca
— Harish M (@chnmharish) August 21, 2025
మీడియాలో ఈ అంశం వైరల్ అయింది. నటి నేరుగా ఎమ్మెల్యే రాహుల్ పేరు చెప్పలేదు. కానీ అందరికీ ఆయనేనని అర్థమైపోయింది. దాంతో ఆయనపై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఎమ్మెల్యే రాహుల్ ఆమె తన స్నేహితురాలు అని.. రీని జార్జ్ చేసిన ఆరోపణలు తన గురించి కాదని రాహుల్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎవరూ వినడం లేదు. రాహుల్ కాదు అని రీని జార్జ్ కూడా ప్రకటించకపోవడంతో ఆయనేనని అందరికీ క్లారిటీ వచ్చింది.
🚨 CONGRESS SUSPENDS RAHUL MAMKOOTATHIL AMID MISCONDUCT ALLEGATIONS
— The Tradesman (@The_Tradesman1) August 25, 2025
KPCC suspends Palakkad MLA Rahul Mamkootathil for six months over multiple sexual misconduct allegations. Party stops short of demanding resignation. Mamkootathil loses CLP privileges, barred from UDF meetings.… pic.twitter.com/9rN8igk3sF
అయితే ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ వేచి చూస్తూ వచ్చింది. ప్రజాగ్రహం ఎక్కువగా ఉండే సరికి.. మొదటగా ఆయనను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. నిరసనలు చల్లారకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.





















