News
News
X

Congress On Currency Notes: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ బొమ్మ ఎందుకు లేదు? కొత్త వాదన తెరపైకి తెచ్చిన కాంగ్రెస్

Congress On Currency Notes: కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ బొమ్మనూ ముద్రించాలని కాంగ్రెస్ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది.

FOLLOW US: 
 

Congress On Currency Notes:

కేజ్రీవాల్‌పై ఫైర్..

ఇండియన్ కరెన్సీపై లక్ష్మీదేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేజ్రీవాల్ వ్యాఖ్యల్ని ఆప్‌ సమర్థించుకుంటోంది. మిగతా పార్టీల నేతలు...ఎవరి స్టైల్‌లో వాళ్లు విమర్శలు చేస్తున్నారు. కౌంటర్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే భాజపా తీవ్రంగా మండి పడగా...ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి దీనిపై స్పందించారు. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాంధీ బొమ్మ పక్కన అంబేడ్కర్ బొమ్మ ఎందుకు లేదని ప్రశ్నించారు. అహింస, రాజ్యాంగవాదం, సమతావాదం అనే అంశాలు మనలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. ఆధునిక భారత్‌కు ఇదే సరైన ప్రతీక అని అన్నారు తివారి. ఇక భాజపా అయితే...కేజ్రీవాల్‌పై తీవ్రంగా ఫైర్ అవుతోంది. గుజరాత్ ఎన్నికల కోసమే ఆయన "హిందూ కార్డ్‌" రాజకీయాలు చేస్తున్నారని మండి పడుతోంది. నిజానికి...ఇలా కరెన్సీ నోట్లపై బొమ్మలు మార్చేయాలన్న డిమాండ్ గతంలోనూ వినిపించింది. గత వారం Akhil Bharat Hindu Mahasabha (ABHM) కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మను కరెన్సీ నోట్లపై ముద్రించాలని చెప్పింది. అంతే కాదు. రబీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, ఏపీజే అబ్దుల్ కలామ్ బొమ్మలు ముద్రించాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ల నేపథ్యంలో RBI స్పందించింది. కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని తేల్చి చెప్పింది. అయినా...ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. 

ఇదీ జరిగింది..

News Reels

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మన ఇండియన్ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణపతి బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి సూచించారు. లక్ష్మీ దేవి, గణేషుడి బొమ్మలు మన కరెన్సీపై ఉంటే దేశం ఇంకా సంపన్నమవుతుందని అన్నారు. మహాత్మా గాంధీ బొమ్మ పక్కనే లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలూ ముద్రించాలని సూచించారు. "ఇండోనేషియా కరెన్సీ నోట్లపై గణేషుడి బొమ్మ ఉన్నప్పుడు మన కరెన్సీపై ఉంటే తప్పేంటి. ఈ విషయమై కేంద్రానికి రెండ్రోజుల్లో లేఖ రాస్తాను. ప్రస్తుత మన దేశ ఆర్థిక వ్యవస్థ చక్కబడాలంటే ఆ దేవతల ఆశీర్వాదం కూడా అవసరమే" అని వ్యాఖ్యలు చేశారు కేజ్రీవాల్. భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా కేజ్రీవాల్‌పై మండి పడ్డారు. "ఒకప్పుడు హిందూ దేవుళ్లు, దేవతలను అపహాస్యం చేసిన కేజ్రీవాల్ ఉన్నట్టుండి హిందువుగా మారిపోయారు" అంటూ విమర్శించారు. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లనని అప్పట్లో ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండి పడ్డారు. భాజపా విమర్శలపై ఆప్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు "కేజ్రీవాల్‌ సూచనపై భాజపాకు అంత కడుపు మంట ఎందుకు..? ఆయన దేశం మేలు కోరే కదా అలాంటి సలహా ఇచ్చింది" అని వెల్లడించారు సంజయ్ సింగ్. "ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇలాంటి కష్టకాలంలో మనం కలిసికట్టుగా పని చేయాలి. సమస్యను పరిష్కరించుకోవాలి. వీటితో పాటు దేవుళ్ల ఆశీర్వాదమూ అవసరమే. ఇప్పటి నుంచి ముద్రించే కొత్త కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలనూ ముద్రించాలి. భాజపా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తోందో అర్థం కావట్లేదు. ప్రధాని మోదీ కూడా స్పందించి అందుకు అంగీకరిస్తారో లేదో సమాధానం చెప్పాలి" అని అన్నారు సంజయ్ సింగ్. 

Also Read: UK PM Rishi Sunak’s Cars: ప్రధాని కావడానికి ముందు రిషి సునాక్ ఏ కారు వాడేవారో తెలుసా? ఆయన కాన్వాయ్ ప్రత్యేకతలు ఇవే

 

Published at : 27 Oct 2022 11:11 AM (IST) Tags: currency notes Kejriwal Congress On Currency Notes Congress Currency Contrevarsy Babasaheb Ambedkar

సంబంధిత కథనాలు

తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్ "ఘాజీ "కీ అమెరికాకు లింకేంటి ? ఘాజీ శకలాలను చూస్తారా !

Navy Day History: భారత నేవీ వైజాగ్‌లో పేల్చేసిన పాక్ సబ్ మెరైన్

టాప్ స్టోరీస్

President Droupadi Murmu : ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu :  ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది, దేశాభివృద్ధిలో కీలక పాత్ర- రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Mlc Kavitha Meets CM KCR : సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Mlc Kavitha Meets CM KCR :  సీఎం కేసీఆర్ తో మరోసారి ఎమ్మెల్సీ కవిత భేటీ, సీబీఐ నోటీసులపై చర్చ!

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'