News
News
X

UK PM Rishi Sunak’s Cars: ప్రధాని కావడానికి ముందు రిషి సునాక్ ఏ కారు వాడేవారో తెలుసా? ఆయన కాన్వాయ్ ప్రత్యేకతలు ఇవే

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కావడానికి ముందు వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ వాడే వారు. అతడి కుటుంబ సభ్యులు ఈ కారులో నిరాడంబర ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం ఆయన ఉపయోగించే కాన్వాయ్ చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది.

FOLLOW US: 

రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానికి బాధ్యతలు చేపట్టిన భారతీయ సంతతి వ్యక్తి. ఆర్థిక మంత్రిగా ఆదేశ స్థితిగతులను మార్చే ప్రయత్నం చేసిన ఆయన.. తీవ్ర సంక్షోభ సమయంలో ఆంగ్లేయుల ప్రధాని పదవిని స్వీకరించారు. బ్రిటన్ చరిత్రలోనే అతి చిన్న వయస్సులో ప్రధాని అయిన వ్యక్తిగా రిషి రికార్డు సాధించారు. కేవలం 42 ఏళ్లకే యూకే పాలన పగ్గాలు చేపట్టారు. ప్రపంచ టెక్ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి అల్లుడైన రిషి.. చాలా సింఫుల్ గా ఉండటానికే ఇష్టపడతారు. బ్రిటన్ ప్రధాని కాకముందు రిషి సునాక్‌కు నాలుగు కార్లు ఉన్నాయి. అందులో అత్యంత నిరాడంబరమైన వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ను ఎక్కువగా వినియోగించేవారు. UKకు ప్రధాన మంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత  సరికొత్త డిఫెండర్ SUV అయిన ల్యాండ్ రోవర్‌ కాన్వాయ్‌ ని వాడుతున్నారు.

రిషికి ఇష్టమైన కారు ఏంటో తెలుసా?

రిషి సునక్ తనకు సొంతంగా వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్‌ను మాత్రమే కలిగి ఉందని వెల్లడించారు. ఇది తనకు ఎంతో ఇష్టమైన కారని ఆయన చాలాసార్లు చెప్పారు. ఇది UK మాస్ మార్కెట్ సెగ్మెంట్‌ లో ప్రముఖ కారుగా ప్రసిద్ధి చెందింది. అతడి కుటుంబంలో ల్యాండ్ రోవర్‌తో పాటు లెక్సస్, BMW కార్లు కూడా ఉన్నాయి.  లెక్సస్, BMW  కార్లు కాలిఫోర్నియా శాంటా మోనికాలోని ఫ్యామిలీ మెంబర్స్ ఉపయోగిస్తున్నారు. లండన్ లో రిషి సునాక్ ప్రయాణించేందుకు మాత్రం వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్‌ను ఉపయోగించారు. ఈ కారు అతడి కుటంబంలో ఉన్న మిగతా మూడు కార్లతో పోల్చితే చాలా సింపుల్ కారు. ఈ కారు 2019 కంటే ముందు మోడల్. అంతేకాదు, లండన్ లో ప్రయాణాలకు ఈ కారు చాలా అనుకూలంగా ఉంటుంది. UKలో, వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ గా అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా రికార్డు సాధించింది.

Read Also: వారెవ్వా, ఓలా ఎలక్ట్రిక్ కారు ఫస్ట్ లుక్ అదుర్స్ - ఎప్పుడు లాంచ్ కానుందో తెలుసా?

రిషి సునాక్ కాన్వాయ్ లోని స్పెషల్ కార్లు!

ప్రస్తుతం రిషి సునాక్ యూకే ప్రధానమంత్రిగా ఉన్న కారణంగా ఆయనకు లేటెస్ట్ కార్ల కాన్వాయ్ ఉంటుంది. రాజ భవనంలా ఉండే ఆల్ట్రా లగ్జోరియల్ రేంజిరోవర్ సెంటినల్ ఉపయోగిస్తున్నారు.  ఇది ల్యాండ్ రోవర్ స్పెషల్ వెహికల్ ఆపరేషన్స్ ద్వారా నిర్మించిన ఆర్మర్డ్ వేరియంట్. ఆర్మర్డ్ గ్లాస్, రూఫ్ బ్లాస్ట్ ప్రొటెక్షన్, ఎమర్జెన్సీ ఎస్కేప్ సిస్టమ్‌ తో సహా సరికొత్త ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. ఈ కారులో ఒక టన్ను కంటే ఎక్కువ ఆర్మర్ ప్లేట్, గ్లాస్ ఉంటుంది. ఇంజిన్ 380PS 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 పెట్రోల్ మోడల్ ను కలిగి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా తయారు చేయబడిన వీల్స్ ను  కలిగి ఉంది, ఇవి రన్ ఫ్లాట్ సిస్టమ్‌ కలిగి ఉండటం వల్ల టైర్ దెబ్బతిన్నప్పటికీ  వాహనాన్ని గంటకు 80 కిలో మీటర్ల వేగంతో 50 కిలో మీటర్ల దూర్ వరకు నడిపే అవకాశం ఉంటుంది. అటు ఈ కాన్వాయ్ లో  జాగ్వార్ XJLతో సహా ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఉన్నాయి. ఈ కార్లు అత్యంత అధునాతన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

News Reels

Published at : 27 Oct 2022 10:58 AM (IST) Tags: UK Prime Minister Rishi Sunak UK PM Rishi Sunak’s Cars Range Rover Lexus Volkswagen Hatchback

సంబంధిత కథనాలు

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Mercedes-Benz EQB: దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే బెంజ్ కారు, త్వరలో తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUV లాంచ్

Mercedes-Benz EQB: దేశీయ మార్కెట్లోకి అదిరిపోయే బెంజ్ కారు, త్వరలో తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ లగ్జరీ SUV లాంచ్

టాప్ స్టోరీస్

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Roja Comments: ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీలో అభ్యర్థులు కూడా లేరు, ఇదేం కర్మరా బాబు: మంత్రి రోజా

Kavita Vs Sharmila : రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు - ఇదిగో షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Kavita Vs Sharmila  :  రాజకీయాల్లో తిట్లతోనే కాదు కవితలతోనూ విమర్శించుకోవచ్చు  - ఇదిగో  షర్మిల, కవితల సాహిత్య సంవాదం !

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ - ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Nara Bramhani Bike Rider : లెహ్ నుంచి లద్దాఖ్ వరకూ నారా బ్రహ్మణి బైక్ జర్నీ  -  ఎందుకు ? ఏమిటి ? ఎలా?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?

Bigg Boss 6 Telugu: ఆదిరెడ్డికి టిక్కెట్ టు ఫినాలే? ఫైనల్‌కు దూసుకెళ్లిన సామాన్యుడు?