అన్వేషించండి

Revath Reddy: పులి కోసమే చూస్తున్నా, బయటికిరాగానే చెట్టుకు వేలాడదీస్తాం - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

Revanth Reddy Commnets: విదేశీ పర్యటనలో భాగంగా రేవంత్ లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం (జనవరి 21) లండన్ లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు.

Revanth Reddy Comments on KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కనిపించకుండా చేస్తానని, ఆ పార్టీని 100 మీటర్ల లోతున గొయ్యి తీసి పాతిపెడతానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన లండన్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం (జనవరి 21) లండన్ లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు.

కేసీఆర్ ప్రస్తుతం కోలుకుంటున్నందున.. త్వరలో పులి బయటికి వస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు పదే పదే చెబుతుండడంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంట్లో పడుకున్న పులి లేచి రాబోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, తాను కూడా దానికోసమే చూస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. తమవద్ద బోను, వల ఉన్నాయని.. పులిని తమ కార్యకర్తలు చెట్టుకు వేలాడదీస్తారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ నెల 26వ తేదీ తర్వాత తాను సుడిగాలి పర్యటనలు చేపట్టబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంద్రవెల్లిలో ప్రారంభించి రాష్ట్రం నలుమూలలా పర్యటనలు చేస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

5వ తేదీనే జీతాలు చెల్లించా
డిసెంబరులో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి గర్వం, అహంకారం తాను తగ్గిస్తానని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చూపుతామని అన్నారు. కొంత మంది తమ కుటుంబం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రూ.లక్ష కోట్లు దోపిడీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అభివృద్ధి గురించి చర్చలే జరగొద్దని మాట్లాడుతున్నారని అన్నారు. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణకు తెచ్చిన అప్పు రూ.72 వేల కోట్లుగా ఉంటే.. గత పదేళ్లలో ఒకేఒక్క కుటుంబం ఏకంగా రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని నిందించారు. ప్రభుత్వోద్యోగులకు 25వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాను సీఎం అయ్యాక మొదటి నెలలోనే 5వ తేదీలోగా జీతాలు చెల్లించినట్లుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కుటుంబం చెర నుంచి తెలంగాణను విముక్తం చేశామని.. దశాబ్ద కాలం పీడకలగా మారిన కేసీఆర్‌ పాలనను బంగాళాఖాతంలో విసిరేశామని రేవంత్ రెడ్డి అన్నారు.

మూసీ నదిపై చర్చ

మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలను థేమ్స్ నది పాలకమండలి అధికారులు, నిపుణులతో రేవంత్ రెడ్డి చర్చించారు. ‘‘హైదరాబాద్ మూసీ నది వెంబడి అభివృద్ధి చెందింది. అయితే హుస్సేన్‌సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉండటంలో ప్రత్యేకత ఉంది. ఉస్మాన్‌సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల ద్వారా అభివృద్ధి చేయబడింది. ఒకసారి మూసీని పునరుజ్జీవింపజేసి, దాని పూర్తి శక్తికి తీసుకువస్తే, హైదరాబాద్ నగరం.. నది, సరస్సుల ద్వారా మరింత బలం పొందుతుంది’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget