అన్వేషించండి

Chinese City Tangshan: మహిళలపై దాడి చేసినందుకు, నగరం మొత్తానికి శిక్ష వేశారు-ఎక్కడో తెలుసా

చైనాలోని తంగ్‌షన్ నగరంలో నలుగురు మహిళలపై దుండగులు దాడి చేశారు. ఆగ్రహించిన ప్రభుత్వం ఆ సిటీకి సివిలైజ్డ్ స్టేటస్ తొలగించింది.

సివిలైజ్డ్‌ స్టేటస్ పోగొట్టుకున్న నగరం..

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే ఆకతాయిలు అల్లరి పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 
కొన్ని దేశాల్లో ఇలాంటి దుండగులకు నామమాత్రపు శిక్ష వేసి వదిలేస్తాయి. మరికొన్ని దేశాల్లో ఊహించని స్థాయిలో శిక్ష విధించి అలాంటిఘటనలు మళ్లీ  జరగకుండా చూసుకుంటాయి. అయితే చైనా మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నం. ఓ మహిళను ఇబ్బంది పెట్టారన్న కారణంగా ఏకంగా ఆ సిటీకి "సివిలైజ్డ్" స్టేటస్‌నే తొలగించేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ  న్యూస్‌ వైరల్‌ అయింది. అసలు విషయం ఏంటంటే చైనాలోని తంగ్‌షన్ సిటీలో ఓ రెస్టారెంట్‌కి నలుగురు మహిళలు వెళ్లారు. తినటం పూర్తయ్యాక రెస్టారెంట్ బయటకు వచ్చారు.అప్పుడే కొంత మంది ఆకతాయిలు వాళ్లను చుట్టుముట్టారు. తీవ్రంగా కొడుతూ కింద పడేసి లాగారు. జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్చారు. మరికొందరు వీరితో చేయి కలిపి మహిళలందరిపరైనా ఇదే విధంగా దాడి చేశారు. జూన్ 10న ఈ సంఘటన జరగ్గా..ఈ ఉదంతం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరు మహిళలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.  

కఠినంగా శిక్షించాలంటూ ప్రజల డిమాండ్ 

ఇంత విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరా దృశ్యాలు బయటకురావటం వల్ల ఒక్కసారిగాచైనా వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మహిళలకు భద్రత లేదంటూ అందరూ నినదించారు. సోషల్ మీడియాలోనూ హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక, ప్రజల్లో ఆగ్రహం రెట్టింపైంది. ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదంతా గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించింది. సెంట్రల్ కమ్యూనిటీ పార్టీ కమిటీకి చెందిన సివిలైజేషన్ ఆఫీస్‌ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. వెంటనే తంగ్‌షన్ సిటీకి సివిలైజ్డ్ హోదా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. 

నేషనల్ సివిలైజ్డ్‌ సిటీస్‌ వెబ్‌ సైట్ ప్రకారం...ఓ నగరం సివిలైజ్డ్‌ హోదా పొందాలంటే 8 అంశాల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. సామాజికభద్రత అనేది ఇందులో అత్యంత కీలకమైన విషయం. ఈ అంశంలో తంగ్‌షన్‌ లోబడిలేదన్న కారణంగా నాగరికత లేని నగరంగాప్రకటించారు. 2011 నుంచి దాదాపు నాలుగు సార్లు సివిలైజ్డ్‌ హోదా సాధించింది ఈ నగరం. కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో ఆ హోదా, గౌరవం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని ఇప్పటికే ప్రభుత్వం అక్కడి పోలీసులను ఆదేశించింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
RS Praveen Kumar: పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hero Nikhil: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
Tummala Nageswararao: 'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB vs KKR Match Highlights | ఆర్సీబీ కి చిన్నస్వామిలో కేకేఆర్ పెద్దషాక్ | IPL 2024 | ABP DesamDil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
కోల్‌కతా చేతిలో బెంగళూరు చిత్తు, ఈ సీజన్‌లో అలా తొలిసారి!
RS Praveen Kumar: పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పార్టీ మారుతున్న కడియం, కేకే - తాను మాత్రం గొర్రెను కాదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Hero Nikhil: టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - కండువా కప్పి ఆహ్వానించిన నారా లోకేశ్
Tummala Nageswararao: 'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
'వ్యవసాయ పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది' - రూ.2 లక్షల రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Kia EV9: ఈ కియా కారుకు ప్రత్యేక ఘనత - వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత!
ఈ కియా కారుకు ప్రత్యేక ఘనత - వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత!
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు, నిందితుల ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డ్: NIA
IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Embed widget