Metro Ticket For 5 Rupees: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - రూ.5కే మెట్రో టికెట్
Chennai Metro Rail Limited: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న రూ.5కే మెట్రో టికెట్ అందించనున్నట్లు తెలిపింది.
Chennai Metro Rail Limited Offers 5 Rupees Ticket on 17th December: చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (Chennai Metro Rail Limited) ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 17న రూ.5కే (5 Rupees Metro Ticket) మెట్రో ట్రైన్ టికెట్ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. తొలుత డిసెంబర్ 3న ఈ ఆఫర్ వర్తింపచేయగా, ఆ రోజు వర్షాల కారణంగా ఎక్కువ మంది మెట్రో రైలులో ప్రయాణించని కారణంగా డిసెంబర్ 17న (ఆదివారం) ఈ సదుపాయం వర్తింపచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. CMRL స్టాటిక్ క్యూఆర్ కోడ్, పేటీఎం, వాట్సాప్ లేదా ఫోన్ పే వంటి డిజిటల్ పద్ధతులను ఉపయోగించే ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్ కింద రూ.5కే టికెట్ సొంతం చేసుకోవచ్చు. సింగిల్ జర్నీ E - QR టికెట్లను కొనుగోలు చేయడానికి డిజిటల్ పద్ధతులు వాడే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. అయితే, CMRL యాప్ లో జారీ చేసిన పేపర్ టికెట్లు లేదా స్టోర్ వాల్యూ పాస్ లకు ఈ ఆఫర్ వర్తించదని అధికారులు పేర్కొన్నారు.
కారణమిదే
నగరవాసులకు విశేష సేవలందిస్తోన్న చెన్నై మెట్రో రైల్ వ్యవస్థను డిసెంబర్ 3, 2007న తమిళనాడు ప్రభుత్వం స్థాపించింది. ఈ క్రమంలో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఈ నెల 3న (ఆదివారం) 16వ వార్షికోత్సవం జరుపుకొంది. ఈ సందర్భంగా ఆ రోజున ప్రయాణికులకు రూ.5కే టికెట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆ సమయంలో 'మిగ్ జాం' తుపాను కారణంగా నగరంలో భారీ వర్షాలు కురవగా వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఈ ఆఫర్ ను ప్రయాణికులు ఎవరూ వినియోగించుకోలేదని భావించిన చెన్నై మెట్రో రైల్ అధికారులు ఈ నెల 17న ఆఫర్ వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారని చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది.
Also Read: Article 370 Abrogation: ఆర్టికల్ 370 రద్దుపై 'సుప్రీం' తీర్పు - చారిత్రాత్మకమంటూ ప్రధాని మోదీ హర్షం