Rajiv Gandhi Foundation: రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై కేంద్రం వేటు, ఆ నిబంధనలు పాటించనందుకే
Rajiv Gandhi Foundation License: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిబంధనలు అనుగుణంగా నడుచుకోవటం లేదంటూ కేంద్రం లైసెన్స్ రద్దు చేసింది.
Rajiv Gandhi Foundation License:
లైసెన్స్ రద్దు..
రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (RGF)కు చెందిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) లైసెన్స్‌ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. గాంధీ కుటుంబానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఇది. చట్ట ప్రకారం నడుచుకోవడం లేదన్న కారణంగా...ఈ లైసెన్స్‌ని రద్దు చేసినట్టు తెలిపింది. 2020లో ఓ అంతర్గత కమిటీని నియమించింది కేంద్ర హోంశాఖ. ఈ కమిటీ విచారణ చేపట్టిన తరవాతే..ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఇదే విషయాన్ని ఓ అధికార ప్రతినిధి వెల్లడించారు. "నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్ రద్దు చేశాం" అని చెప్పారు. ఈ మేరకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపారు. ఆ ఆఫీస్ నిర్వాహకులకూ నోటీసులు వెళ్లాయి. "రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎన్నోసార్లు నిబంధనలు ఉల్లంఘించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించింది. 2020 జులైలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను 1991లో స్థాపించారు. Enforcement Directorate (ED) అధికారి ఈ విచారణ చేపట్టారు. గాంధీ కుటుంబానికి చెందిన మొత్తం మూడు స్వచ్ఛంద సంస్థలపై నిఘా పెట్టారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (RGCT), ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లు...మనీ లాండరింగ్ యాక్ట్, ఇన్‌కమ్ ట్యాక్స్, FCRA నిబంధనలకు లోబడలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సంస్థకు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ట్రస్టీలుగా ఉన్నారు. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు అండగా నిలవడం లాంటి సేవలు అందించేందుకు 1991లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.
కొత్త అధ్యక్షుడిగా ఖర్గే..
కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు. ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతూ తీర్మానాలు కూడా చేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు ఖర్గేకు ఓటు వేశారు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి అందర్నీ కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Shocking: తాంబూలం వేసుకున్న కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు రైతులు మృతి