Canada Airspace: కెనడా ఎయిర్స్పేస్లోనూ అనుమానాస్పద వస్తువు, పేల్చేసిన అమెరికా - ఇది కూడా చైనా పనేనా?
Canada Airspace: కెనడా ఎయిర్స్పేస్లోనూ ఓ అనుమానాస్పద వస్తువుని గుర్తించిన అమెరికా వెంటనే పేల్చి వేసింది.
![Canada Airspace: కెనడా ఎయిర్స్పేస్లోనూ అనుమానాస్పద వస్తువు, పేల్చేసిన అమెరికా - ఇది కూడా చైనా పనేనా? Canada US fighter jet shoots down unidentified object Canada on target of China America piled up on orders of PM Trudeau Canada Airspace: కెనడా ఎయిర్స్పేస్లోనూ అనుమానాస్పద వస్తువు, పేల్చేసిన అమెరికా - ఇది కూడా చైనా పనేనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/12/a67883bba5e6c33356938e55039c4e591676179722624517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Canada Airspace:
కెనడా గగనతలంలోనూ ఓ అనుమానాస్పద వస్తువు చక్కర్లు కొట్టడం సంచలనమైంది. ఇప్పటికే అమెరికాలో చైనా స్పై బెలూన్‌తో పాటు ఓ
అనుమానాస్పద వస్తువు అలజడి సృష్టించింది. వాటిని విజయవంతంగా పేల్చేసింది అగ్రరాజ్యం. ఇప్పుడు కెనడాలోనూ అదే తరహాలో ఓ వస్తువుని గుర్తించిన అమెరికా...వెంటనే పేల్చేసింది. ఉత్తర కెనడా గగనతలంలో ఇది చక్కర్లు కొట్టగా..అమెరికా ఫైటర్ జెట్లు దాన్ని పేల్చేశాయి. అంతకు ముందు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు.
"కెనడా ఎయిర్ స్పేస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వస్తువుని పేల్చివేయాలని ఆదేశాలిచ్చాను. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం. నార్త్ అమెరిక్ ఏరో స్పేస్ డిఫెన్స్ కమాండ్...ఈ వస్తువుని విజయవంతంగా పేల్చేసింది"
జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధాని
I ordered the take down of an unidentified object that violated Canadian airspace. @NORADCommand shot down the object over the Yukon. Canadian and U.S. aircraft were scrambled, and a U.S. F-22 successfully fired at the object.
— Justin Trudeau (@JustinTrudeau) February 11, 2023
I spoke with President Biden this afternoon. Canadian Forces will now recover and analyze the wreckage of the object. Thank you to NORAD for keeping the watch over North America.
— Justin Trudeau (@JustinTrudeau) February 11, 2023
చైనా స్పై బెలూన్ వివాదం ఇంకా ముగిసిపోలేదు. ఇటీవలే ఓ బెలూన్ను పేల్చేసిన అమెరికా...ఇప్పుడు మరోసారి అదే పని చేసింది. ఓ అనుమానాస్పద వస్తువుని గుర్తించిన అమెరికా సైనికులు ఫైటర్ జెట్‌తో దాన్ని కాల్చి పారేశారు. అలాస్కాలో 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ వస్తువుని పేల్చేసినట్టు చెప్పారు. "ఎగురుతున్న వస్తువు ఏంటన్నది క్లారిటీ లేదు. కానీ అది ప్రజలకు హాని కలిగిస్తుందేమోనన్న అనుమానంతో ముందుగానే పేల్చేశాం" అని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అంతకు ముందు పేల్చేసిన స్పై బెలూన్ కన్నా తక్కువ సైజ్‌లో ఉన్నట్టు వివరించారు. ఓ చిన్న కారు సైజ్‌లో ఉన్నట్టు తెలిపారు. అది ఎక్కడి నుంచి వచ్చింది..? ఏ దేశానికి చెందింది..? అన్నది తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ వస్తువు గగనతలంలో ఎందుకు చక్కర్లు కొట్టిందన్నదీ ప్రస్తుతానికి తేలలేదని చెప్పారు. అమెరికా ఎయిర్‌బేస్‌లో చైనా స్పై బెలూన్ చక్కర్లు కొట్టడం సంచలనమైంది. దాదాపు రెండు రోజుల పాటు దానిపై నిఘా పెట్టిన అగ్రరాజ్యం.. చివరకు ఫైటర్ జెట్‌తో పేల్చి వేసింది. అయితే...ఈ స్పై బెలూన్ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. అమెరికానే కాకుండా మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది.
Also Read: Turkey Earthquake: 94 గంటల పాటు శిథిలాల కిందే, బతకడం కోసం తన మూత్రం తానే తాగాడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)