Brother Anil Kumar: మాజీ ఎంపీ హర్ష కుమార్‌తో బ్రదర్ అనిల్ భేటీ - గంటపాటు చర్చలు!
Brother Anil Kumar News: కుటుంబ సమేతంగా తన కుమారుడు వివాహానికి వచ్చే ఆశీర్వదించాలని హర్ష కుమార్ ను ఆహ్వానించినట్లుగా బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు.
Brother Anil Kumar meets Ex MP Harsha Kumar: మాజీ ఎంపీ హర్ష కుమార్ ని బ్రదర్ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొడుకు పెళ్లి కార్డు నిమిత్తం హర్ష కుమార్ నివాసానికి వచ్చినట్లుగా బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు. వీరి మధ్య భేటీ హర్ష కుమార్ నివాసంలోనే సుమారు గంట పాటు జరిగింది. ఈ సందర్భంగా హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు బ్రదర్ అనిల్ కుమార్ చిన్నప్పటినుంచి తెలుసని.. బ్రదర్ అనిల్ - షర్మిల వివాహానికి ముందే తమ స్నేహం ఉందని అన్నారు. తాము ఇద్దరం మంచి మిత్రులం అని అన్నారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం జరిగిందని అన్నారు. అనిల్ ను హర్ష కుమార్ శాలువాతో సత్కరించారు. అనిల్ - షర్మిలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
కుటుంబ సమేతంగా తన కుమారుడు వివాహానికి వచ్చే ఆశీర్వదించాలని హర్ష కుమార్ ను ఆహ్వానించినట్లుగా బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు. ‘‘హర్ష కుమార్ 26 కత్తిపోట్లకు గురయి తిరిగి లేచి నించుని.. ఒక ప్రజా నాయకుడిగా ఎదగడం నేను కళ్లారా చూశాను. దేవుడి కృప వల్ల ఆయన ఆరోగ్యంతో ఈ రోజున చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా ఒక మంచి నాయకుడి కింద ఎదిగి రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని బ్రదర్ అనిల్ ప్రార్థన చేశారు.