Next Chief Justice: భారత తదుపరి చీఫ్ జస్టిస్‌గా బీఆర్ గవాయ్ - సిఫారసు చేసిన కొలీజియం
CJI: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బీఆర్ గవాయ్ నియమితులు కానున్నారు. ఈ మేరకు కొలీజియం సిఫారసను కేంద్రానికి పంపింది.

Chief Justice of India:Y భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ను కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేస్తారు. మే 14 నుంచి ఆయన చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తారు. ఆయన పదవి కాలం నవంబర్ 24, 2025 వరకు ఉంటుంది. కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసను లాంఛనంగానే భావిస్తుంది. కనుక జస్టిస్ బీఆర్ గవాయ్ నెక్ట్స భారత ప్రధాన న్యాయమూర్తి అని అనుకోవచ్చు.
STORY | CJI Sanjiv Khanna recommends appointment of Justice B R Gavai as next CJI
— Press Trust of India (@PTI_News) April 16, 2025
READ: https://t.co/pXq3s7NIFw pic.twitter.com/bqHsQJpXpV
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఆయన తండ్రి రామకృష్ణ గవాయ్ మాజీ రాజ్యసభ సభ్యుడు . మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. జస్టిస్ గవాయ్ నాగ్‌పూర్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1985లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో న్యాయవాదిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. నాగ్‌పూర్ , ముంబైలో న్యాయవాదిగా పనిచేశారు, ప్రధానంగా రాజ్యాంగ, పరిపాలనా మరియు సివిల్ చట్టాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. 2003లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 16 సంవత్సరాలకు పైగా హైకోర్టులో సేవలందించారు. నాగ్‌పూర్ మరియు ముంబై బెంచ్‌లలో పనిచేశారు.
మే 24, 2019న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టులో ఆయన రాజ్యాంగ, క్రిమినల్, సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ చట్టాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన కేసుల్లో తీర్పులు ఇచ్చారు. జస్టిస్ గవాయ్ సీజేఐగా పదవీ కాలం ఆరు నెలలు (మే 14, 2025 నుంచి నవంబర్ 24, 2025 వరకు ఉంటుంది.ఆయన 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Big news Supreme court 🚨
— narne kumar06 (@narne_kumar06) April 16, 2025
Chief justice Sanjiv Khanna recommends to Union Law Ministry appointment of Justice B R Gavai as next Chief justice of India ..
Justice Gavai will be sworn in on 14th May..
He belongs to the SC community...after 15 years
SC Chief Justice of India pic.twitter.com/r7emwB631O
జస్టిస్ గవాయ్ దళిత వర్గానికి చెందిన వారు. 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండవ దళిత న్యాయమూర్తిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. జస్టిస్ గవాయ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అభిమానం కలిగిన న్యాయమూర్తి. ఆయన న్యాయపరమైన తీర్పుల్లో సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని న్యాయనిపుణులు చెబుతారు. సుప్రీంకోర్టులో ఆయన రాజ్యాంగ బెంచ్‌లలో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నారు. ఆయన తీర్పులు సామాజిక న్యాయం, మానవ హక్కులు, రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే దిశగా ఉన్నాని నిపుణులు ప్రశంసిస్తారు.





















