Bombay High Court: 'ఇంటి పని చేయమని చెప్తే పని మనిషిలా చూస్తున్నట్లా?'- బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Bombay High Court: వివాహితను ఇంటి పని చేయమని చెప్పినంత మాత్రాన పని మనిషిలా చూస్తున్నారని భావించడం కరెక్ట్ కాదని బాంబే హైకోర్టు పేర్కొంది.
Bombay High Court: వివాహితకు అత్తింటివారు ఇంటి పనులు చేయాలని చెప్పడం క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది.
If a woman had no wish to do household activities, then she ought to have told it prior to marriage so that bridegroom can rethink about the marriage: Bombay High Court pic.twitter.com/OWZ4zU68Iy
— Bar & Bench (@barandbench) October 27, 2022
ఇలా పిటిషన్
పెళ్లయిన తర్వాత నెల రోజుల వరకు అంతా బాగానే ఉందని, ఆ తర్వాత నుంచి అత్తింటి వారు తనను పని మనిషిలా చూస్తున్నారని ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటి పనంతా తనతోనే చేయిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
ఇలా తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అనంతరం ఈ కేసులో మహిళ.. తన భర్త, అతడి తల్లిదండ్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెబుతూ కోర్టు కేసును కొట్టివేసింది.
Also Read: Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'