Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో జంట పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుడు సంభవించిన కొద్ది క్షణాల్లోనే మరో పేలుడు వార్త బయటకొచ్చింది.
అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లో జంట పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుడు సంభవించిన కొద్ది క్షణాల్లోనే మరో పేలుడు వార్త బయటకొచ్చింది. కాబూల్ సమీపంలోని హోటల్‌లో రెండో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ హోటల్‌లో అమెరికన్లు ఉన్నట్లు సమాచారం.
Second explosion reported in Kabul, near hotel where Americans gathered
— ANI Digital (@ani_digital) August 26, 2021
Read @ANI Story | https://t.co/56P4Evrg1j#KabulAiport #explosion pic.twitter.com/8q0IPf0s01
కాబూల్ విమానాశ్రయం వెలుపల ఈరోజు సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 72 మంది చనిపోయినట్లు తాలిబన్ల నేతలు ప్రకటించారు. మృతుల్లో 12 అమెరికా దళాలు సహా చిన్నారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్వీట్ చేశారు. క్షతగాత్రుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.
ఇది ఆత్మాహుతి దాడి అని అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. కాబూల్ విమానాశ్రయంలోని అబ్బే గేల్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగిందని అధికారులు చెబుతున్నట్లు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కరెస్పాండెంట్ జెన్నిఫర్ గ్రిఫీన్ ట్వీట్ చేశారు.
పేలుడు సంభవించిన సమయంలో తాను ఓ అఫ్గాన్ వ్యక్తితో మాట్లాడుతున్నానని యూకే పార్లమెంట్ సభ్యురాలు నస్ ఘని తెలిపారు. అతడు ఫోన్ మాట్లాడుతోన్న సమయంలోనే భారీ పేలుడు సంభవించిందని చెప్పారు. తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
We can confirm an explosion outside Kabul airport. Casualties are unclear at this time. We will provide additional details when we can.
— John Kirby (@PentagonPresSec) August 26, 2021
#UPDATE The Pentagon confirmed Thursday that a large explosion occurred outside #Kabul airport, as the US-led airlift continued inside the compound.
— AFP News Agency (@AFP) August 26, 2021
"Casualties are unclear at this time. We will provide additional details when we can," said spokesman John Kirby. #Afghanistan pic.twitter.com/PRQofBx0H7
జెన్నిఫర్ గ్రిఫీన్ ట్వీట్..
NEW: Suicide bomber “complex SBIED attack” with firefight at Abbey Gate outside Kabul airport; Afghan casualties: US official
— Jennifer Griffin (@JenGriffinFNC) August 26, 2021
నస్ ఘని ట్వీట్..
Explosion at Kabul airport.
— Nus Ghani MP (@Nus_Ghani) August 26, 2021
I was on the phone to an Afghan outside the airport when he heard the explosion.
Praying that he gets away safely and we get his family safe passage out of this nightmare. https://t.co/hLZIURQozp
ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అమెరికా రక్షణ దళాల లక్ష్యంగా దాడి చేసినట్లు పేర్కొంది.