అన్వేషించండి

Mother Amritanandamayi: సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే సేవాభావం, నిబద్ధత, సహనం ముఖ్యం - మాతా అమృతానందమయి సూచనలు

BJP Vishnu: సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే సేవాభావం, నిబద్ధత, సహనం అవసరమని మాతా అమృతానందమయి అన్నారు. కేరళ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పని చేసిన విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు.

Mother Amritanandamayi message:బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి కేరళ పర్యటనలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, 'హగ్గింగ్ సెయింట్'గా ప్రసిద్ధి చెందిన మాతా అమృతానందమయి ను దర్శించుకున్నారు. కొల్లం జిల్లాలోని అమృతపురి ఆశ్రమానికి వెళ్లిన ఆయన, అమ్మ ఆశీస్సులు తీసుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. 
  
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆధ్యాత్మిక గురువుగా, సేవామూర్తిగా వెలుగొందుతున్న మాతా అమృతానందమయి దేవిని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కేరళలోని కొల్లం జిల్లా సముద్ర తీరప్రాంతంలో ఉన్న అమృతపురి ఆశ్రమానికి వెళ్లిన ఆయనకు అమ్మ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మ ఆశీస్సులు పొందడం తన జీవితంలో మర్చిపోలేని అద్భుత ఘట్టమని, లోకకల్యాణం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మహాత్మురాలిని కలవడం ఆధ్యాత్మిక బలాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఈ భేటీ సందర్భంగా మాతా అమృతానందమయి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. దేశాభివృద్ధి, సమాజ శ్రేయస్సు, పేదల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై అమ్మ ఆయనకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలంటే రాజకీయ నాయకులకు సేవాభావం, నిబద్ధత, సహనం ఎంత అవసరమో ఆమె వివరించారు. రాజకీయాలకు అతీతంగా మానవ విలువల కోసం పనిచేయాలని ఆమె అందించిన మార్గదర్శకాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం, ప్రజలకు మరింత చేరువ కావాలని అమ్మ ఇచ్చిన సూచనలు తనపై బాధ్యతను మరింత పెంచాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సేవలో భాగస్వామ్యం కావడం ద్వారానే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఆమె చెప్పిన మాటలు భవిష్యత్ కార్యాచరణకు స్పష్టతనిచ్చాయని అన్నారు. అమ్మ చూపిన మార్గంలో పయనిస్తూ, సమాజ సేవలో మరింత చురుగ్గా పాల్గొంటానని, ఆమె ఆశీస్సులు తన అడుగుజాడలకు శ్రీరామరక్షగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  

అమ్మ  ఆశీస్సులు కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక బలం మాత్రమే కాకుండా, ప్రజా సేవలో తన సంకల్పాన్ని మరింత దృఢపరిచే శక్తిగా నిలుస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తన జీవితాంతం ప్రజా క్షేమం కోసం పనిచేయాలనే పట్టుదలను ఈ భేటీ పెంచిందని, తన ప్రతి అడుగులో అమ్మ మార్గదర్శనం దిశానిర్దేశం చేస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.                                                 

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
ABP Desam Top 10, 10 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 10 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget