Biparjoy Cyclone Wind Speed: 150 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తున్న బిపర్జోయ్ తుపాన్, ప్రభావం ఎంతంటే?
Biparjoy Cyclone Wind Speed: బిపర్జోయ్ తుపాన్ కారమంగా సౌరాష్ట్ర, కచ్ లలో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.
Biparjoy Cyclone Wind Speed: బిపర్జోయ్ తుపాను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌లలో అలర్ట్ ప్రకటించారు. కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుఫాను 'బిపార్జోయ్' ల్యాండ్‌ఫాల్ ( తీరం దాటుతుందని) అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే గుజరాత్ తీర ప్రాంతాల నుంచి 50 వేల మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. వాయుగుండం గుజరాత్ తీరం వైపు దూసుకుపోవడంతో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. తుఫాను గురువారం సాయంత్రం "తీవ్రమైన తుఫానుగా" తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట గాలి వేగం గంటు 150 కిలో మీటర్లకు చేరుకుంటుందని తెలిపారు.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 1130 IST today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat) and 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port by evening of 15th June as VSCS.@WMO pic.twitter.com/WwUYPMFAc2
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023
ఆరు గంటల నుంచి తుఫాన్ గురించి మాట్లాడుతున్నట్లయితే... గత ఆరు గంటల్లో దాని వేగం మందగించింది. తుఫాన్ ప్రస్తుతం ఈశాన్య అరేబియా సముద్రంలో జఖౌ ఓడరేవుకు 280 కి.మీ దూరంలో ఉంది. తుపాను కారణంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఈ నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. అనవసరంగా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వాస్తవానికి గాలి 150 కి.మీ వేగంతో వీచినప్పుడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే నష్టాలు కల్గే అవకాశం కూడా చాలా ఎక్కువే. బలమైన గాలులు వీస్తున్న సమయంలో కిలోల బరువున్న వస్తువులు కూడా కదులుతుంటాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్తుంటాయి. ఈ తుఫాన్ ప్రభావంతో రాళ్లు, రప్పలు ఇతర వస్తువులు సైతం కొట్టుకుపోతుంటాయి.
ఇంత బలమైన గాలిలో ఏం జరుగుతుంది?
అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ వెబ్‌సైట్‌లో గాలి వేగం ఆధారంగా జరిగే నష్టం గురించి వివరించారు. ఇందులో ఇచ్చిన సమాచారం ప్రకారం.. గాలి గంటకు 96 -110 మైళ్ల వేగంతో అంటే దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీచినప్పుడు అది చాలా నష్టం కలిగిస్తుంది. ఈ గాలి బాగా నిర్మించిన ఇంటి పైకప్పు మరియు సైడింగ్ ను కూడా పాడయ్యేలా చేస్తుంది. ఇంత వేగంగా వీచే గాలుల వల్ల చాలా పెద్ద పెద్ద చెట్లు కూడా నేలకొరిగే అవకాశం ఉంది. అనేక చెట్లకు నష్టం వాటిల్లుతుంది. దీంతో పాటు స్తంభాలు కూలిన ఘటనలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
గాలి కారును కదిలించగలదా?
గంటకు 3 మైళ్ల వేగంతో గాలి వీచినప్పుడు.. ఆకులు సులభంగా ఎగిరిపోతాయి. కానీ మనం కారు గురించి మాట్లాడినట్లయితే.. అది గంటకు 90 మైళ్ల వేగంతో అంటే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తే కార్లు కదులుతాయి. అలాగే ఒక వ్యక్తి దీని కంటే తక్కువ గాలిలో కూడా కదలగలడు. కిలోల వారీగా చూస్తే.. 28 మైళ్లు అంటే గంటకు 45 గాలి వేగం కూడా 37 పౌండ్ల అంటే 16 కిలోల బరువును ఎత్తగలదని చికాగో వెబ్‌సైట్‌లో లో వివరించారు. ఇలాంటి పరిస్థితిలో 150 కిలో మీటర్ల గాలిలో చాలా వస్తువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళవచ్చు. కానీ ఇది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ఏ వస్తువులు ఎగిరిపోతాయి?
ఈ గాలిలో ఏ వస్తువులు ఎగురుతాయో స్పష్టంగా చెప్పడం కష్టం. గాలి ద్వారా ఎగిరిపోయే పదార్థం గాలి యొక్క శక్తి, పదార్థం యొక్క ప్రాంతం, ఒత్తిడి మరియు CD పై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా వస్తువుల ఆకృతి, దాని ఆకృతి, ఉపరితల వైశాల్యం మరియు వస్తువుల రూపకల్పన మొదలైన వాటిపై ఆధారపడుతుంది. ఒక కుర్చీ తక్కువ గాలి వేగంతో ఎగిరిపోతుంది. కానీ రాయిలాగా అదే బరువు గల మరేదీ ఎగిరిపోదు. ఎలాంటి స్థలంలో, ఎలాంటి పరిస్థితుల్లో అవి ఉన్నాయో చూస్తే తప్ప అవి ఎగరగలవో లేదో తెలియదు.