Bimbisara Release Date: నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార' రిలీజ్ డేట్
Bimbisara Movie Release Date news: నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'బింబిసార'. ఉగాది సందర్భంగా విడుదల తేదీ వెల్లడించారు.
నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార (Bimbisara Movie). ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కల్యాణ్ రామ్ 18వ చిత్రమిది (NKR18). ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీ ప్రకటించారు.
'బింబిసార' సినిమాను ఆగస్టు 5న (Bimbisara On August 5th, 2022) విడుదల చేయనున్నట్టు తెలిపారు. సూట్ వేసుకున్న కళ్యాణ్ రామ్ స్టయిలిష్ లుక్ విడుదల చేశారు. 'బింబిసార' ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు కళ్యాణ్ రామ్ లుక్ కొత్తగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు క్రూరుడైన బింబిసారుడి లుక్‌లో... కదన రంగంలో శత్రు సైనికులను చంపి, వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కథానాయకుడి లుక్ విడుదల చేశారు.
'ఓ సమూహాం తాలూకూ ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే... కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే... ఇందరి భయాన్ని చూస్తూ... పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం... బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం' అంటూ విడుదల చేసిన 'బింబిసార' టీజర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కదన రంగంలో కత్తి దూసిన కల్యాణ్ రామ్ వీరోచితంగా కనిపించారు. రాజుగా, ఈ తరం యువకుడిగా... సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేశారు.
Also Read: సుదీప్ పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?
'బింబిసార' కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీనా హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, వరికుప్పల యాదగిరి పాటలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్
The date is locked for BIMBISARA to ascend the throne 🔥#Bimbisara grand release on 5th August 💥#HappyUgadi ❤️#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt @anilpaduri @NTRArtsOfficial pic.twitter.com/cFhr62CmCe
— NTR Arts (@NTRArtsOfficial) April 2, 2022